https://oktelugu.com/

చైనాకు ధీటైన సమాధానమిచ్చిన కేంద్రం

భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి 3గంటలకు ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బ కొట్టడంతో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. గాల్వాన్లో సుమారు వెయ్యిమంది చైనా సైనికులు భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో దాడికి యత్నించగా మన సైనికులు ప్రతిదాడి చేశారు. ఈ సంఘటనలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే చైనా మృతుల వివరాలను దాచిపెడుతోంది. అంతేకాకుండా భారత సైనికులే తమ భూభాగంలోకి వచ్చి దాడికి పాల్పడ్డారని ముందస్తుగా స్పందించి ప్రపంచం ముందు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 18, 2020 / 12:39 PM IST
    Follow us on


    భారత్-చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి 3గంటలకు ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బ కొట్టడంతో భారత జవాన్లు 20మంది వీరమరణం పొందారు. గాల్వాన్లో సుమారు వెయ్యిమంది చైనా సైనికులు భారత జవాన్లపై రాళ్లు, రాడ్లతో దాడికి యత్నించగా మన సైనికులు ప్రతిదాడి చేశారు. ఈ సంఘటనలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే చైనా మృతుల వివరాలను దాచిపెడుతోంది. అంతేకాకుండా భారత సైనికులే తమ భూభాగంలోకి వచ్చి దాడికి పాల్పడ్డారని ముందస్తుగా స్పందించి ప్రపంచం ముందు భారత్ ను దోషిగా చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబర్ టైమ్స్ లో భారత్ అహంకారంతో వ్యవహరిస్తుందని విషపూరిత కథనాలను ప్రచురిస్తూ విషం చిమ్ముతోంది.

    ఇదిలా ఉంటే తాజాగా చైనా మరోసారి బరితెగించింది. గాల్వన్ వ్యాలీ తమదేనంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి భారత్ కూడా ధీటైన జవాబిచ్చింది. గాల్వాన్ లోయ తమదేనని చైనా ప్రకటించడం తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ బుధవారం అర్ధరాత్రి ప్రకటన జారీ చేసింది. ఈమేరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఒప్పందాన్ని గుర్తు చేసింది. జూన్ 6న ఇరుదేశాల మిలటరీ కమాండర్స్ మధ్య జరిగిన ఒప్పందాన్ని చైనా నిబద్ధతతో అమలు చేయాలని భారత్ స్పష్టం చేసింది.

    చైనా ఓవైపు భారత్ ను శాంతి చర్చలు అంటూనే దొంగదెబ్బ కొట్టడంపై భారత్ సీరియస్ గా స్పందిస్తోంది. గాల్వాన్ లోయలోకి చైనా కాలుపెట్టి భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత్ సైనికులను కావాలని రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పిడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో ఎప్పుడే ఏం జరుగుతుందా? అనే టెన్షన్ నెలకొంది. భారత్ జవాన్లు 20మంది మృతిచెందాడటంతో చైనా అంశాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంపై ప్రధాని చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లోని కమాండర్లకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని వారికి కల్పించింది. దీంతో భారత సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్రివిధ దళాలు కూడా సన్నద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.

    చైనా దేశం భారత్ కంటే తామే శక్తిమంతులమని నిరూపించుకునేందుకు బలం ప్రయోగం చేస్తోంది. దీంతో భారత్ కూడా తమను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని సంకేతాన్ని చైనాకు పంపింది. ఓ వైపు చైనా శాంతి చర్చలు అంటూనే గాల్వన్ వ్యాలీ తమదేనని ప్రకటించుకొని చైనా ద్వంద్వ నీతిని బయటపెడుతోంది. డ్రాగన్ కంట్రీ చేస్తున్న నక్కజిత్తులను భారత్ కూడా అంతే సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. దీంతో సరిహద్దుల్లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో భారత్-చైనా సంబంధాలు మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయనేది ఉత్కంఠను రేపుతోంది.