Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గ్లామర్ షో.. వైరల్ గా మారిన ఫొటోలు

నిహారిక విడాకులు తీసుకున్న తరువాత పలు సందర్భాల్లో కనిపించారు. అంతేకాదు తరచూ సోషల్ మీడియాల్ కనిపిస్తున్న మెగా డాటర్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ జాలిగా గడుపుతోంది.

Written By: Neelambaram, Updated On : December 18, 2023 2:42 pm
Follow us on

Niharika Konidela: సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టీ, ముద్దుల కూతురు నిహారిక. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిహారిక గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా పరిచయం అయినప్పటికీ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు. అంతేకాదు తన అల్లరితో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు.

యాంకర్ గా రాణించడమే కాకుండా వెండితెరపై అడుగుపెట్టిన మెగా డాటర్ పలు సినిమాల్లో నటించారు. హీరోయిన్ గా అభిమానుల మనసుల్లో తనదైన మార్క్ వేశారు. మంచి గుర్తింపుతో పాటు మంచి టాక్ సాధించినప్పటికీ ఆ సినిమాలు భారీ విజయాలను అయితే అందించలేదు. దీంతో సినిమాలకు దూరమైన నిహారిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జైపూర్ ప్యాలెస్ లో జరిగంది.

పెళ్లి అయిన మూడు సంవత్సరాల తరువాత నిహారిక భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అంతేకాదు నిహారికపై మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలుస్తోంది.

అయితే నిహారిక విడాకులు తీసుకున్న తరువాత పలు సందర్భాల్లో కనిపించారు. అంతేకాదు తరచూ సోషల్ మీడియాల్ కనిపిస్తున్న మెగా డాటర్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ జాలిగా గడుపుతోంది. విడాకులు తీసుకున్నప్పటి నుంచి నిహారికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో నిహారికపై దారుణంగా నెగిటివ్ కామెంట్స్ ను ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

తాజాగా నిహారిక ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. పొట్టి డ్రస్సులు వేసుకుని కనిపించింది. పింక్ కలర్ టాప్ బ్లూ కలర్ పొట్టి జీన్స్ ధరించి ఉన్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పిక్స్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఇందుకోసమేనా విడాకులు ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రీ బర్డ్ లా తిరగడం కోసం మొగుడికి విడాకులు ఇచ్చావా అంటూ పలు కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.