https://oktelugu.com/

Christmas release movies: క్రిస్మస్ కి పండుగే.. బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలివీ.. ఎవరిపై ఏ అంచనాలంటే..?

ఇక ఈ క్రిస్మస్ పండుగని క్యాష్ చేసుకోవడానికి ప్రభాస్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా 1000 కోట్ల పైన కలక్షన్స్ ని వసూలు చేస్తుంది అని సినిమా యూనిట్ భావిస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 18, 2023 / 02:32 PM IST
    Follow us on

    Christmas release movies: ప్రతి సినిమాని ఏదో ఒక పండుగకి రిలీజ్ చేసి ఆ పండుగకి ప్రేక్షకుల్లో ఉన్న ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా సినిమా మేకర్స్ వాళ్ళ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదే క్రమంలో తనదైన రీతిలో సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికే ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ను కొట్టబోతున్నాడు అనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి.

    ఇక ఈ క్రిస్మస్ పండుగని క్యాష్ చేసుకోవడానికి ప్రభాస్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా 1000 కోట్ల పైన కలక్షన్స్ ని వసూలు చేస్తుంది అని సినిమా యూనిట్ భావిస్తుంది. అలాగే ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి మరి ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి…

    ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు.ఇక ఇలాంటి సమయం లో వరుసగా పఠాన్, జవాన్ సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్న షారుక్ ఖాన్ ఇప్పుడు రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వస్తున్న డాంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ సినిమాతో హిట్ కొట్టి తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాడు.అందులో భాగంగానే ఇప్పటికే బాలీవుడ్ హీరో అయిన రన్బీర్ కపూర్ అనిమల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో సక్సెస్ సినిమాల పరంపర మరొకసారి కొనసాగిందనే చెప్పాలి.గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ సినిమాలు ఎవర్ని ఆకట్టుకోకపోవడంతో సౌత్ సినిమాలు అక్కడ సందడి చేస్తున్నాయి.ఇక ఈ క్రమంలో సినిమాలతో షారుక్ పఠాన్ జవాన్ సినిమాలతో కొంతవరకు మెప్పించినప్పటికీ అనిమల్ సినిమాతో మాత్రం రన్బీర్ కపూర్ అవుట్ అండ్ ఒక వెయ్యి కోట్ల కలక్షన్స్ ని సాధించే సినిమాను చేసి పెట్టాడు…ఇక దాంతో డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అయ్యే ఈ డాంకి సినిమా మీద కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ చేస్తూ పండుగ సీజన్ క్యాష్ చేసుకోవాలని మేకర్స్ చూస్తున్నారు…

    ఇక హాలీవుడ్ హీరో అయిన జాసన్‌ మోమోవా కథానాయకుడిగా జేమ్స్‌ వాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆక్వామెన్‌. ఈ సినిమా 2018లో విడుదలై బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.ఇక ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సీక్వెల్ కూడా మొదటి దానికి కొనసాగింపు గా వస్తుంది. ఇక మాంటా ఆర్థర్ కుటుంబాన్ని అట్లాంటిస్ పై పగ తీర్చుకోవడానికి ఏం చేశాడు అనే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఆక్వమాన్ 2 వస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుంది అనేది చూడాలి…

    ఇక క్రిస్మస్ కి థియేటర్ లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒటిటి లోకి కూడా మరికొన్ని సినిమాలు వస్తున్నాయి…అవేంటో ఒకసారి తెలుసుకుందాం…

    నెట్ ఫ్లిక్స్

    ది రోప్‌ కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 17 న స్ట్రీమింగ్ అవుతుంది…
    మేస్ట్రో (హాలీవుడ్‌) డిసెంబరు 20 వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది…

    వైష్ణవ్ తేజ్ హీరో గా, శ్రీలీలా హీరోయిన్ గా వచ్చిన ఆది కేశవ సినిమా కూడా డిసెంబరు 22 న స్ట్రీమింగ్ కి రెఢీ అయింది…అలాగే వీటితో పాటు గా
    టాప్‌గన్‌: మావెరిక్‌ (హాలీవుడ్),కర్రీ అండ్‌ సైనైడ్‌ (డాక్యుమెంటరీ),రెబల్‌ మూన్‌ (హాలీవుడ్) లాంటి సినిమాలు డిసెంబర్ 22 వ తేదీన స్ట్రీమింగ్ కి రెఢీ అవుతున్నాయి…

    అమెజాన్‌ ప్రైమ్‌
    డ్రై డే (హిందీ) డిసెంబరు 22
    సప్తసాగర దాచే ఎల్లో సైడ్‌:బి (కన్నడ) డిసెంబరు 22 న స్ట్రీమింగ్ కి రెఢీ అవుతున్నాయి…

    జియో సినిమా
    ది సావనీర్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17
    హే కామిని (హిందీ) డిసెంబరు 22
    లయన్స్‌ గేట్‌ ప్లే
    ఫియర్‌ ది నైట్‌ (హాలీవుడ్) డిసెంబరు 22
    బుక్‌ మై షో
    ది మిరాకిల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 19

    ఇక ఈ వారం ఓటిటి లో ఈ సినిమాలు రిలీజ్ కి రెఢీ అవుతుండటం తో సినిమా అభిమానులకి పండగ అనే చెప్పాలి…