Niharika
Niharika: వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అలానే సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మధ్యనే వీరిద్దరికీ నిశ్చితార్థం కాదా వీరిద్దరి మెగా వెడ్డింగ్ ఎప్పుడు ఉంటుంది అని తెగ ఆలోచిస్తున్నారు మెగా అభిమానులు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి సెప్టెంబర్ లోనే కావాల్సి ఉండగా, నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోవడం వల్ల వరుణ్ పెళ్లి ఆలస్యం అయ్యింది అని కథనాలు వినిపించాయి. నిహారిక విడాకులు తీసుకుని ఉండగా వెంటనే వరుణ్ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పుకార్లు చక్కర్లు కొత్తయి.
కాగా ఇప్పుడు వరుణ్ పెళ్లి గురించి ఫైనల్ గా నిహారికనే క్లారిటీ ఇచ్చింది. విరాకుల తర్వాత నిహారిక ఇటీవల తన కుటుంబంతో కలిసి విదేశాలకి వెకేషన్ కి వెళ్ళింది. వాటికి సంబంధించిన ఫోటోలని సైతం తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ.. ‘మా కుటుంబమంతా ఇటీవల కెన్యాకు వెళ్ళాం.. చాలా రోజుల నుండి కెన్యా వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటున్నాము కానీ ఇన్నాళ్లు కుదరలేదు ఇప్పటికి కుదిరింది. దీంతో అందరం కలిసి కెన్యాకు వెళ్లి ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసే టైం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే వెకేషన్ తర్వాత వాళ్ళు అందరూ ఇండియాకు వెళ్లిపోయారు కానీ నేను మాత్రం కొన్ని కారణాలవల్ల అమెరికా వచ్చాను. ఎందుకు అంటే ప్రస్తుతం నా చేతిలో పలు ప్రాజెక్ట్ ఉన్నాయి. ఒక సినిమాకి కూడా నేను ఓకే చేశాను. కాబట్టి 20 రోజులు బ్రేక్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అమెరికా వచ్చాను’ అని చెప్పుకొచ్చింది.
ఇక వరుణ్, లావణ్య పెళ్లి గురించి చెబుతూ… ‘ఇక అన్నయ్య పెళ్లి గురించి చెప్పాలి అంటే.. పెళ్లి ఎక్కడ చేయాలి అన్న విషయం ఇంకా ఫైనల్ కాలేదు. పెళ్లి పనులు ఉన్నాయి త్వరగా వచ్చేయ్ అంటూ అన్నయ్య తెగ ఫోన్లో చేస్తున్నాడు. పెళ్లి పనులు కూడా ఇంకా ఏమి మొదలు పెట్టలేదు. ఇక లావణ్య గురించి చెప్పాలి అంటే.. తన మా అన్నయ్యతో ప్రేమలో పడకముందే నాకు ఒక మంచి స్నేహితురాలు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ క్లారిటీ ఇచ్చింది నిహారిక.