
డిజాస్టర్ హీరోయిన్స్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న బోల్డ్ భామ ‘నిధి అగర్వాల్’కి తెలుగు సినిమాల్లోనే అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తుంటే.. ఈమె గారు బాలీవుడ్ వైపు చూస్తోంది. నిజానికి, నిధి బాలీవుడ్ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ సక్సెస్ రాకే కదా, తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా రాణించడానికి తెగ కష్టపడుతుంది.
అయినా ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా నిధిని తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. కాకపోతే, కన్నడ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది ఈ బ్యూటీ. అలాగే అటు కోలీవుడ్ నుంచి కూడా ఒకటి రెండు ఆఫర్లు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో వచ్చే ఆ అరకొర అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా,
మరోసారి బాలీవుడ్ వైపు తొంగి చూడటం అవసరమా ? నిధి అగర్వాల్ మాత్రం తనది కన్నడ పరిశ్రమలో సెకెండ్ హీరోయిన్ స్థాయి కాదు అనే ఫీల్ లో ఉందట. అందుకే ఎలాగైనా త్వరలోనే మళ్లీ హిందీలోకి రీఎంట్రీ ఇచ్చి, తానేంటో నిరూపించుకుంటాను అంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి హిందీ సినిమాలలో హీరోయిన్ గా నిధికి మళ్ళీ రీఎంట్రీ దొరుకుతుందా ?
తెలుగులో హిట్ హీరోయిన్ అనిపించుకుని స్టార్ స్టేటస్ తెచ్చుకుంటేనే హిందీలో ఛాన్స్ లు ఇవ్వరు. అలాంటిది, తెలుగు డిజాస్టర్ హీరోయిన్ గా ముద్రపడిన నిధి అగర్వాల్ కి ఏ హిందీ దర్శకుడు పిలిచి ఛాన్స్ ఇస్తాడు. మరి మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆరాటపడుతున్న నిధి అగర్వాల్ కి ఆ అవకాశం వస్తోందా.. ప్రాక్టీకల్ గా ఆలోచిస్తే కష్టమే.