Nidhhi Agerwal Sensational Comments: యంగ్ హీరోయిన్స్ లో అందం, టాలెంట్ ఉన్నప్పటికీ పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోతున్న హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhi Agarwal). ఈమె అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘సవ్యసాచి’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయిన, ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. అలా ఇప్పటి వరకు ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటే కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. రీసెంట్ గానే ఈమె హీరోయిన్ గా నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. పవన్కళ్యాణ్, ప్రభ్స్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు రావడం అనేది ఆషామాషీ విషయం కాదు.
ఆమె చేసిన ఆ రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యుంటే ఆమె రేంజ్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లి ఉండేది. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఇకపోతే రీసెంట్ గా ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి పోడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరోలైన వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లపై జరుగుతున్నా విష ప్రచారాల గురించి మీరేమని అంటారు అంటూ నిధి అగర్వాల్ ని యాంకర్ ప్రశ్న అడగ్గా, అందుకు ఆమె ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లు చాలా మంచి వారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ చిన్న పిల్లల మనస్తత్వ కలిగిన వాడు. తన కో స్టార్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటాడు’.
‘ఇక కార్తిక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తన సొంత టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఇలాంటి మంచి మనుషులపై అలాంటి దుష్ప్రచారాలు జరగడం దురదృష్టకరం. సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ఈ విషయాన్నీ అందరూ అర్థం చేసుకోవాలి. నాపైన కూడా గతం లో రెండు మూడు నెగిటివ్ క్యాంపైన్స్ జరిగాయి. ఇండస్ట్రీ లో నన్ను తొక్కేందుకు చాలా కుట్రలు కూడా చేశారు. కానీ నేను వాటిని సమర్థవతంగా ఎదురుకొని బయటపడ్డాను. కాశీ తీర్థయాత్ర తర్వాత నా జీవితమే మారిపోయింది. దేవుడితో, ఆధ్యాత్మికతతో బాగా కనెక్ట్ అయిపోయాను. ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా ఎదురుకోగలను’ అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.