Director Teja son Amitov Teja: సైబర్ నేరగాళ్ల చేతుల్లో సామాన్య ప్రజలే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా మోసపోతున్నారు. ట్రేడింగ్ పేరుతో లక్షల రూపాయిలు తీసుకొని ఉడాయించే బ్యాచ్ ఈమధ్య కాలం లో ఎక్కువ అయిపోయింది. ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ ఇలా ఒక జంట చేతిలో దారుణంగా మోసపోయాడట. హైదరాబాద్ లోని మోతి నగర్ కు చెందిన ఒక ప్రేమ జంట, స్టాక్ మార్కెట్ పేరుతో అమితవ్ తేజ్ ని మోసం చేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో భారీ లాభాలు తెస్తామని చెప్పి అమితవ్ తేజ్ వద్ద 63 లక్షల రూపాయిలు తీసుకున్నారట. దీంతో అమితవ్ తేజ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ జంటపై పోలీస్ కేసు నమోదు చేసాడు. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో సంచలన టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యాపారవేత్తగా గొప్పగా రాణిస్తున్న అమితవ్ తేజ్ కి గత ఏడాది ఏప్రిల్ నెలలో యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం అయ్యింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చని, మేము ట్రేడింగ్ చేయడం లో సిద్ద హస్తులమని, మాకు డబ్బులిస్తే అధిక లాభాలను తెచ్చి పెడుతామని చెప్పారట. ఒకవేళ నష్టాలు వస్తే తమకు చెందిన అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాటు ని ఉచితంగా ఇస్తామని లిఖిత పూర్వకంగా ఆ దంపతులు హామీ ఇచ్చారట. దీంతో వాళ్ళ మాటలను గుడ్డిగా నమ్మి అమితవ్ తేజ పెట్టుబడులు పెట్టాడట. ఇది జరిగిన తర్వాత వారం రోజులకు వాళ్ళ ప్లాన్ ని అమలు చేయడం మొదలు పెట్టినట్టు పోలీసులకు వివరించాడట అమితవ్ తేజ్. ముందుగా 9 లక్షల రూపాయిల లాభం వచ్చిందని కొన్ని నకిలీ పాత్రలను చూపించి నమ్మించారట.
దాంతో విడతల వారిగా అమితవ్ తేజ్ వారికి 63 లక్షల రూపాయిల వరకు ఇచ్చాడట. అయితే కొన్ని రోజుల తర్వాత ఎక్కడో తేడా జరుగుతుంది, పెట్టుబడికి లాభాలు అసలు రావడం లేదనే విషయాన్నీ గ్రహించాడు అమితవ్ తేజ్. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఆ దంపతుల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, వాళ్ళ సొంత అపార్ట్మెంట్స్ లో కూడా కనిపించడం లేదు. దీంతో మోసపోయాను అనే విషయాన్నీ గ్రహించిన అమితవ్ తేజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అంత పెద్ద సెలబ్రిటీ కొడుకునే ఇలా మోసం చేసారంటే, ఇక ఎంత మంది సామాన్యులను ఈ ఖిలాడీ జంట ఇలా నమ్మించి మోసం చేసి ఉంటుందో ఊహించుకోండి.