spot_img
Homeఎంటర్టైన్మెంట్Nidhhi Agerwal: హార్డ్ వర్క్, టాలెంట్ అంతా నథింగ్... హీరోయిన్స్ కి కావాల్సింసింది అదే 

Nidhhi Agerwal: హార్డ్ వర్క్, టాలెంట్ అంతా నథింగ్… హీరోయిన్స్ కి కావాల్సింసింది అదే 

Nidhhi Agerwal: 2017లో విడుదలైన సవ్యసాచి మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది నిధి అగర్వాల్. గ్లామర్ పరంగా సాలిడ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీకి అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్స్ పడటం లేదు. నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ నెక్స్ట్ మూవీ నాగచైతన్య తమ్ముడు అఖిల్ తో జతకట్టింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను కూడా విజయం సాధించలేదు. ప్లాప్స్ లో ఉన్నప్పటికీ నిధికి దర్శకుడు పూరి జగన్నాధ్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ఇస్మార్ట్ శంకర్ మూవీలో నిధి మెయిన్ హీరోయిన్ గా నటించారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిర్మాతలకు భారీగా లాభాలు పంచింది. ఇస్మార్ట్ శంకర్ మూవీతో నిధి ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే మరలా ఆమె పరాజయాల పరంపర కొనసాగింది. తమిళంలో చేసిన భూమి, ఈశ్వరన్ రెండు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి చిత్రాల్లో ఒకటైన హీరో చిత్రంలో నిధి నటించారు. అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ఆ మూవీ ఆడలేదు.

ఐదేళ్ల ఈ జర్నీలో సక్సెస్ ఫార్ములా ఏమిటో చెప్పేసింది నిధి. హీరోయిన్స్ సక్సెస్ ప్యూర్ లక్ మీద బేస్ అవుతుందని చెప్పింది. హార్డ్ వర్క్, టాలెంట్ అంటా ట్రాష్ ని కొట్టిపారేసింది. నిధి మాట్లాడుతూ… పరిశ్రమలో అదృష్టమే కీలకం. పేపర్ మీద అద్భుతం అనిపించిన కథలు సిల్వర్ స్క్రీన్ పై నిరాశపరుస్తాయి. స్క్రిప్ట్ దశలో సాదా సీదా అనిపించిన కొన్ని కథలు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేయవచ్చు. కాబట్టి 90 శాతం సక్సెస్ లక్ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

ఇక కథల ఆధారంగా సినిమాలు ఎంచుకునే స్థాయికి నేను ఎదగలేదని నిధి అగర్వాల్ నిర్మొహమాటంగా చెప్పింది. అయితే డిఫరెంట్ రోల్స్ చేయాలని, డాన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించాలని ఉందని నిధి చెప్పుకొచ్చారు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటన పరంగా ఎలాంటి తారతమ్యాలు లేవు. మార్కెట్ లెక్కల్లో మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. కాగా నిధి చేతిలో ఉన్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper