Nidhi Agarwal Government Vehicle: నేడు ఉదయం నుండి సోషల్ మీడియా లో హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఎంతటి సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయవాడ లో జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఆమె ఒక ప్రభుత్వ వాహనం లో రావడమే అందుకు కారణం. వైసీపీ పార్టీ వాళ్ళు దీనిని ఒక రేంజ్ లో తప్పుబడుతూ ప్రచారం చేశారు. ప్రజా సొమ్ముతో నడిచే ప్రభుత్వానికి సంబంధించిన వాహనంలో ఒక సాధారణ హీరోయిన్ తిరగడం ఏంటి?, ప్రజా సొమ్ముని ఇలా దుర్వినియోగం చేస్తారా అంటూ ఏకిపాడేశారు. అనేక మంది ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చెప్తేనే చేసుంటారు అంటూ ఆయన మీదకు నెట్టేశారు. దానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ధీటైన సమాధానం చెప్పారు. అది ఒక ప్రైవేట్ వాహనమని ఆధారాలతో సహా చూపించారు. అయితే సోషల్ మీడియా లో నెలకొన్న ఈ గందరగోళంపై హీరోయిన్ నిధి అగర్వాల్ కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా స్పందించింది.
Also Read: సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..విషయం ఏమిటంటే!
ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నేడు ఉదయం నుండి నేను రీసెంట్ గా భీమవరం లో జరిగిన ఒక స్టోర్ లాంచ్ కార్యక్రమం గురించి జరుగుతున్న కొన్ని అసత్య ప్రచారాలు నా దృష్టికి వచ్చింది. ఈ ఈవెంట్ కోసం లోకల్ గా ఉన్న కొంతమంది ఆర్గనైజర్లు నాకు అక్కడికి వచ్చేందుకు కారుని పంపించారు. కానీ అది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినది అనే విషయం నాకు తెలియదు. అది కేవలం ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లు మాత్రమే. ఉదయం నుండి కొన్ని మీడియా చానెల్స్ పనిగట్టుకొని మరీ ఇది ప్రభుత్వం పంపిన వాహనం అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నాకు ప్రభుత్వ అధికారులతో ఎలాంటి కనెక్షన్ లేదు, అదే విధంగా ఆ వాహనం కూడా ప్రభుత్వ అధికారికి సంబంధించినది కాదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా ఆడియన్స్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, వాళ్లకు ఎంతో ఎంతో విలువని ఇస్తాను, మరింత తప్పుడు సమాచారాలు ప్రచారం అవ్వకుండా ఉండడం కోసమే నేను ఈ క్లారిటీ అందరికి ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. ఇలాంటి సమయం లో నా మీద పరస్పరం ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న అసత్య వార్తలకు కాస్త చెక్ పడింది. అయితే ఆ వాహనం ఎవరిదీ?, ఎందుకు దానిపై ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ అనే బోర్డు పెట్టారు?, నిధి అగర్వాల్ ప్రారంభించిన స్టోర్ భీమవరం ఎమ్మెల్యే తాలూకు మనిషికి సంబంధించిందా?, భీమవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ కి చెందిన అంజిబాబు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయన మనుషులకు సంబంధించిన స్టోర్ ఇదా? అంటూ సోషల్ మీడియా లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.
— Nidhhi Agerwal Panchami (@AgerwalNidhhi) August 11, 2025