Nidhi Agarwal: గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్న హీరోయిన్స్ లో ఒకరు నిధి అగర్వాల్(Nidhi agarwal). ఈ ఏడాది జులై 24 న విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్,ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఏ రేంజ్ లో పాల్గొనిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ ఆమెని పొగడ్తలతో ముంచి ఎత్తాడు కూడా. ఇక ఇప్పుడు ఆమె ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja saab Movie) చిత్రం లో కూడా ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఆమె చాలా చురుగ్గా పాల్గొంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా రీసెంట్ గానే ‘రాజా సాబ్’ చిత్రం లోని రెండవ పాట ‘సహానా..సహానా’ ని హైదరాబాద్ లోని లుల్లూ మాల్ లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిధి అగర్వాల్ కి ఎలాంటి చేదు అనుభవం ఎదురైందో మనమంతా చూసాము.
ఈవెంట్ ని ముగించుకొని బయటకు వస్తున్న సమయం లో అభిమానులు ఒక్కసారిగా నిధి అగర్వాల్ వైపు దూసుకొని రావడం తో ఆమె నలిగిపోయింది. ముఖ్యంగా ఆమె ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఎట్టకేలకు సిబ్బంది దగ్గరుండి ఆమెని అతి కష్టం మీద కారు ఎక్కించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆరోజు రాత్రి అనర్థమే జరిగి ఉండేది. అయితే ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా లుల్లూ మాల్ యాజమాన్యం పై, అదే విధంగా ఆ ఈవెంట్ ని నిర్వహించిన శ్రేయాస్ మీడియా పై కేసు నమోదు చేశారు. నేడు నిధి అగర్వాల్ ని కూడా సంప్రదించిన పోలీసులు, మీతో అసభ్యంగా వ్యవహరించిన వారిపై కేసు వేయాల్సిందిగా కోరారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం నాకు ఎవరి పైనా కేసు వెయ్యాలని లేదంటూ పోలీసులకు చెప్పుకొచ్చింది.
దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సెలబ్రిటీలు స్పందించి, కాస్త ధైర్యంగా వ్యవహరించాలి అంటూ కామెంట్స్ చేశారు. మరోపక్క పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించిన నిధి అగర్వాల్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిధి అగర్వాల్ మొదటి నుండి చాలా మంచి అమ్మాయి. తన అభిమానులను ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది, వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లను కూడా క్షమిస్తుంది. ఆమె స్థానం లో ఏ హీరోయిన్ ఉన్నా, ఈరోజు మొన్న జరిగిన సంఘటనపై రియాక్షన్ వేరేలా ఉండేది. నిధి అగర్వాల్ ఆ ఛాన్స్ తీసుకోలేదు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.