Shivaji Comments: పబ్లిక్ ఫంక్షన్స్ లో ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇక సినిమా సెలబ్రిటీలైతే ఎంత పొదుపుగా మాట్లాడితే ప్రేక్షకుల్లో అంత గౌరవాన్ని పొందుతారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం తీవ్రమైన విమర్శలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు… సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు శివాజీ..ప్రస్తుతం ఆయన విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. అలాంటి శివాజీ సినిమా హీరోయిన్లను ఉద్దించి కొన్ని అసభ్యకరమైన కామెంట్లైతే చేశాడు. ఈనెల 25వ తేదీన ‘దండోరా’ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో శివాజీ హీరోయిన్స్ ని ఉద్దేశించి మాట్లాడాడు…హీరోయిన్స్ మీరు చిన్న చిన్న బట్టలు కట్టుకోకుండా చీరలు కట్టుకొని తయారవ్వండి, కొంతమంది దరిద్రపు ముండలు అన్ని కనిపించేలా బట్టలు వేసుకుంటారు. మీ సామాన్లని ఎవరికి చూపించకండి అంటు వ్యాఖ్యలు చేశాడు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…
దీని మీద అనసూయ సైతం చాలా ఘాటుగా స్పందించింది. నా బాడీ నా ఇష్టం అంటూ ఒక ఇమేజ్ ను పోస్ట్ చేసింది. దాంతో చిన్మయి సైతం శివాజీ మాట్లాడిన దరిద్రపు ముండలు అనే మాటను ఖండిస్తున్నాను అంటూ ఒక పోస్ట్ ద్వారా ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులకు నోటి దురుసు ఉందని, అమ్మాయిలంటే ఆట బొమ్మలుగా భావించే వాళ్ళకి లేడీస్ గురించి ఏం తెలుసు…
ఆడవాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ చాలామంది మహిళలు సైతం ఈ విషయం మీద ఘాటుగా స్పందిస్తున్నారు… నిజానికి శివాజీ అనే కాదు గతంలో పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం ఆడవారిని తక్కువ చేసి మాట్లాడారు. పురుషాధిత్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఇండస్ట్రీ మగాళ్లకు మాత్రమే శాశ్వతం కాదని, ఆడవాళ్లు కూడా అందులో నటిస్తేనే సినిమా సక్సెస్ సాధిస్తుంది.
వాళ్ళు లేకపోతే సినిమాని ఎవ్వరు చూడరని కేవలం మగాళ్ళ వల్ల మాత్రమే సినిమాలు ఆడవనే నిజాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక శివాజీ మాటలను పలు మహిళా సంఘాలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి… ఇక వెంటనే శివాజీ తను చేసిన వ్యాఖ్యల మీద క్షమాపణలు కోరాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక శివాజీ సైతం తను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ క్షమాపణలు కోరాడు. ఇక ఈ విషయం ఇంతటితో సద్దుమణుగుతుందా?లేదంటే మరో దుమారం ఏదైనా రేగబోతోందా అనేది తెలియాల్సి ఉంది…