Nidhhi Agerwal: తెలుగు సినిమాల్లో హీరోయిన్ కి ఏమి కావాలి ? మంచి అందం ఉండాలి, అలాగే ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటపడ కూడదు. అలాగే సెట్స్ లో పెద్దగా డిమాండ్స్ కూడా చేయకూడదు. ఇక కొన్నిటికి సర్దుకుపోయే హీరోయిన్ అయితే, ఇక ఆమెకు తిరుగు ఉండదు. ఐతే, ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఓ హీరోయిన్ కి ప్రస్తుతం అవకాశాలు లేవు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం రండి.
Nidhhi Agerwal
ఆ హీరోయిన్ పేరు.. నిధి అగర్వాల్. నిధికి అవకాశాలు రావట్లేదు, టాలీవుడ్ లో ఏ హీరోయిన్ సినీ కెరీర్ అయినా ఓన్లీ సక్సస్ ల మీదే ఆధారపడి ఉంటుందని నిధి అగర్వాల్ ను చూస్తే అర్ధం అవుతుంది. స్టార్ గా వెలిగిపోవాల్సిన బ్యూటీ.. చిన్నాచితకా చిత్రాలతో నలిగిపోతుంది. ఎంత అందం ఉన్నా, ఏ రేంజ్ లో ఆ అందచందాలను పరిచినా.. ఇక ఎంతగా అభినయంతో ఆకట్టుకున్నా.. నిధి అగర్వాల్ ను మాత్రం మేకర్స్ పట్టించుకోవడం లేదు.
Also Read: BalaKrishna: 30 ఏళ్ళ క్రితమే KGF ని తీసేసిన బాలయ్య బాబు
సక్సెస్ లేకపోతే ఇక ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేస్తారు. సరే ఇప్పుడు సినిమా ఛాన్స్ లు రాకపోతే, తర్వాత అయినా వస్తాయిలే అనుకోవచ్చు. కానీ చేతిలో ఉన్న అవకాశాలు కూడా జారిపోతుంటే. ఇక ఆ హీరోయిన్ మానసిక పరిస్థతి ఎలా ఉంటుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పరిస్థితి అసలేం బాగాలేదు. నిధి అగర్వాల్ ఇన్నాళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నాననే ఆనందంలో ఉంది.
ఐతే, ఆ ఆనందం నిధి అగర్వాల్ కి ఎక్కువ రోజులు నిలవలేదు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్ పాత్రను చాలా వరకు తగ్గించేశారు. ఆమె ఇప్పుడు ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాత్రమే. హీరోయిన్ గా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. కానీ.. చివరకు గెస్ట్ హీరోయిన్ గా ఆమె మిగిలిపోయింది.
Nidhhi Agerwal
అసలుకే నిధి అగర్వాల్ కు ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయని.. ఆమెకు వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటి నెమ్మదిగా వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్ళి పోతున్నాయి. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కూడా ఆమెను హీరోయిన్ గా తప్పించారు అంటే.. ఇక నిధి అగర్వాల్ మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిధి పరిస్థితి విధి అనుకుని బాధ పడటం తప్ప ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. ఏది ఏమైనా నిధి బాధ వర్ణనాతీతం,
Also Read:BalaKrishna: 30 ఏళ్ళ క్రితమే KGF ని తీసేసిన బాలయ్య బాబు
Recommended Videos: