పవన్ పై ‘ఇస్మార్ట్’ బ్యూటీ అదిరిపోయే కామెంట్

దేశంలో లాక్డౌన్ అమలుతో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇటీవల తానే స్వయంగా కేక్ తయారు చేసి అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా ట్వీటర్ ద్వారా […]

Written By: Neelambaram, Updated On : April 9, 2020 6:22 pm
Follow us on


దేశంలో లాక్డౌన్ అమలుతో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇటీవల తానే స్వయంగా కేక్ తయారు చేసి అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా ట్వీటర్ ద్వారా ఈ అమ్మడు అభిమానులతో ఇంటరాక్ట్ అయి వారడిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చి అందరినీ ఖుషీ చేసింది.

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. బుధవారం ట్వీటర్లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారడిని ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు పవన్ కళ్యాణ్‌, హృతిక్ రోషన్, నిధి పెళ్లిపై పలు ప్రశ్నలు అడిగారు. ‘పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని అడగగా.. ‘సినిమాకు పవన్ కల్యాణ్ సార్ ఒక గిఫ్ట్’ అని నిధి సమాధానమిచ్చింది. నిధి చెప్పిన సమాధానికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అలాగే హృతిక్ గురించి అడిగిన ప్రశ్నకు ‘ఇప్పటివరకు నేను చూసిన మోస్ట్ కంప్లీట్ యాక్టర్ ఆయనే.. నిజమైన స్ఫూర్తి.. అందగాడు..’ అంటూ పొగడ్తలవర్షం కురిపించింది.

‘లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా?’ అనే ప్రశ్నకు.. తాను ఇంట్లో కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేసింది. టాలీవుడ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన హీరోయిన్లు ఉన్నారంది. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అని ‘గబ్బర్ సింగ్’ డైలాగ్ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ రవితేజతో, మహేష్ అల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచమవుతున్న మూవీలో నటిస్తుంది.