https://oktelugu.com/

లావణ్య త్రిపాఠి కెరీర్ లైన్లో పడింది!

అందాల రాక్షసి ఫేమ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు.అయినా గానీ లావణ్య కి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా ‘అర్జున్ సురవరం’ సినిమా రూపంలో మంచి హిట్ వచ్చినాక లావణ్య త్రిపాఠి కెరీర్ కొంచెం ముందుకు కదులుతోంది అని చెప్పొచ్చు .. కెరీర్ ఆరంభంలో లో అంగాంగ ప్రదర్శన చెయ్యనని.,. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని గిరిగీసుకొని చాలా ఛాన్స్ లు […]

Written By:
  • admin
  • , Updated On : April 9, 2020 / 06:29 PM IST
    Follow us on


    అందాల రాక్షసి ఫేమ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు.అయినా గానీ లావణ్య కి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా ‘అర్జున్ సురవరం’ సినిమా రూపంలో మంచి హిట్ వచ్చినాక లావణ్య త్రిపాఠి కెరీర్ కొంచెం ముందుకు కదులుతోంది అని చెప్పొచ్చు ..

    కెరీర్ ఆరంభంలో లో అంగాంగ ప్రదర్శన చెయ్యనని.,. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని గిరిగీసుకొని చాలా ఛాన్స్ లు పోగొట్టు కొంది. .ఇప్పుడు గ్లామర్ రోల్స్ కి కూడా రెడీ అని డైరెక్టర్స్ కి సిగ్నల్స్ పంపుతుందట. దాంతో హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబో చిత్రం లో లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది నాని -మారుతి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా లావణ్య త్రిపాఠి నే హీరోయిన్ గా అనుకుంటున్నారట. అలాగే అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్ గా చేస్తోన్న ‘బంగార్రాజు’ చిత్రం లో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది .

    ఇటీవల కరోనా పై పోరాటంలో భాగంగా ఏ స్టార్ హీరోయిన్ విరాళం ప్రకటించని సమయంలోనే అందరి కంటే ముందే లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించి తన ఔదార్యం చాటుకొంది లావణ్య త్రిపాఠి.