గత కొంత కాలంగా బాలీవుడ్ లో బయోపిక్ లు , వాస్తవ కథలతో సినిమాలు తీయడం బాగా పెరిగింది. మరీ ముఖ్యం గా స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ లు బాగానే వచ్చాయి. మేరీ కోమ్ .పాన్ సింగ్ తోమర్ , ఎం ఎస్ ధోని , సచిన్ వంటి చిత్రాలు బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకున్నాయి. వీటిలో దాదాపు అన్ని చిత్రాలు సక్సెస్ సాధించాయి. అందుకే ఇలాంటి చిత్రాలకు ఉన్న ఆదరణ గమనించి మరిన్ని చిత్రాలు రాబోతున్నాయి. ఆ క్రమంలో క్రికెట్ క్రీడకు చెందిన కపిల్ దేవ్ , మిథాలీ రాజ్ వంటి కెప్టెన్ల బయోపిక్ లు చిత్రాలుగా రాబోతున్నాయి.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటించడం జరిగింది . . కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని హిందీ తో పాటు తెలుగులో కూడా ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది.
కాగా ” 83 ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ కపిల్ దేవ్ బయోపిక్ ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు.. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో ఎలా విజయం సాధించింది. వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించు కొంది. .అన్న అంశాల ఆధారంగా చిత్రం తయారౌతోంది ఇక ఈ చిత్రంలో ఉన్న ఇంకో విశేషం ఏమిటంటే కపిల్ దేవ్ నిజ జీవిత భాగస్వామి రోమీ దేవ్ గా దీపికా పడుకొనే నటిస్తోంది. ఆ పాత్ర పోషించినందుకు గాను 15 కోట్లు భారీ పారితోషకం కూడా అందుకొంది.