Icon Star Allu Arjun: సౌత్ లో నటన పరంగా మంచి ప్రతిభ గల హీరోలలో ఒకరు ధనుష్(Hero Dhanush). తమిళ హీరో అయినప్పటికీ, ఈయనకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది. నేటి తరం హీరోలలో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కంటే ముందుగానే నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న నటుడు ఆయన. ఇతనికి తమిళంలో, తెలుగులో, హిందీ లో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇతని ప్రతిభకు హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ముగ్దులై పలు సినిమాలు తీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ధనుష్ సాధించిన విజయాలు ఎన్నో ఉంటాయి. రీసెంట్ గానే ఆయన ‘రాయన్’ అనే చిత్రం తో దర్శకుడిగా కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ రాయన్ చిత్రం. రీసెంట్ గానే ఆయన కొత్తవాళ్లను ప్రధాన పాత్రధారులుగా పెట్టి ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే సినిమా తెరకెక్కించాడు.
ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. తమిళం లో కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే అజిత్ త్వరలోనే తమిళ సూపర్ స్టార్ అజిత్ తో ఒక సినిమా చేయబోతున్నాడని ఒక టాక్ ఉంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, గతంలో ధనుష్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా గీత ఆర్ట్స్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారట. సరైనోడు సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమా కథ చర్చలకు వచ్చింది. కచ్చితంగా కలిసి సినిమా చేద్దాం అనుకున్నారు కానీ, ఇద్దరు స్టార్స్ హీరోలుగా బిజీ అవ్వడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ పాన్ ఇండియా లెవెల్ లో ఎక్కడో ఉంది. ఐదేళ్ల వరకు ఆయన డేట్స్ లాక్.
మరోపక్క ధనుష్ అటు హీరో గా, ఇటు నిర్మాతగా, అప్పుడప్పుడు డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమే. మల్టీస్టార్రర్ సినిమా రావొచ్చేమో తెలియదు కానీ, ధనుష్ దర్శకత్వం లో చేసే అవకాశాలు అయితే లేదు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తూ, హీరో గా నటించిన ‘ఇడ్లీ కడై'(Idly Kadai) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా తెలుగు లో ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుబేర'(Kubera Moive) అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హిందీ లో ఆయన ‘రంజానా’ కి సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇందులో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 2013 వ సంవత్సరం లో ధనుష్, సోనమ్ కపూర్ కాంబినేషన్ లో హిందీ లో రంజానా అనే చిత్రం తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.