https://oktelugu.com/

Nidhhi Agerwal: విప్పి చూపిస్తేనే అవకాశాలిస్తారు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు…!

ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పోతినేనితో నిధి అగర్వాల్ జతకట్టింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆపై తమిళంలో భూమి, ఈశ్వరన్ అనే చిత్రాలు చేసింది. అవి ఆడలేదు. మరలా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 05:10 PM IST

    Nidhhi Agerwal

    Follow us on

    Nidhhi Agerwal: 2017లో నిధి అగర్వాల్ కేరీర్ బాలీవుడ్ లో మొదలైంది. ఆమె డెబ్యూ మూవీ మున్నా మైఖేల్. అనంతరం 2018లో సవ్యసాచి విడుదలైంది. నాగ చైతన్యకు జంటగా ఆమె నటించారు. చందూ మొండేటి దర్శకుడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. అన్నయ్యతో వర్క్ అవుట్ కాలేదని తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది. ఇది కూడా నిరాశపరించింది. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ అమ్మడుకు ఫస్ట్ హిట్ ఇచ్చాడు.

    ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పోతినేనితో నిధి అగర్వాల్ జతకట్టింది. ఈ సినిమా సూపర్ హిట్. ఆపై తమిళంలో భూమి, ఈశ్వరన్ అనే చిత్రాలు చేసింది. అవి ఆడలేదు. మరలా టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో లో నటించింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది వసూళ్లు మాత్రం రాలేదు.

    ప్లాప్స్ లో నిధికి రెండు బంపర్ ఆఫర్స్ రావడం కొసమెరుపు. పాన్ ఇండియా చిత్రాలైన హరి హర వీరమల్లు మూవీలో నిధి మెయిన్ హీరోయిన్. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన ఆమెకు ఛాన్స్ రావడం ఊహించని పరిణామం. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆలస్యం అయ్యింది. వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ మూవీలో కూడా ఆమె ఓ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం..

    ఇదిలా ఉంటే పరిశ్రమలో ఎదగడంపై ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు. స్కిన్ షో చేసిన వాళ్ళకే అవకాశాలు ఉంటాయని అన్నారు. హీరోయిన్ గా ఎదగాలంటే ఎక్స్ పోజ్ చేయడం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే స్క్రిప్ట్ సెక్షన్ లో కూడా ఏమీ ఉండదు. అంతా లక్. పేపర్ మీద అద్భుతం అనుకున్న కథలు వెండితెరపై తేలిపోతాయి. సాదాసీదా అనుకున్న కథలు సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేస్తాయని ఆమె అన్నారు. ఇటీవల వేణు స్వామితో నిధి ప్రత్యేక పూజలు చేయించుకుంది…