Chiranjeevi- Vishal: తమిళంలో స్టార్ హీరో విశాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే విశాల్ తెలుగు వాడే. కానీ తమిళంలో ఎక్కువగా పేరు తెచ్చుకున్నాడు. విశాల్ హీరోగా ఎదిగేంత వరకు అతడి బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ విశాల్ హీరో కాకముందు నుంచే అతడి తండ్రి జీకే రెడ్డి జీకే ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పలు చిత్రాలను తమిళంలో తెలుగులో నిర్మించాడు.
అయితే జీకే రెడ్డి తెలుగులో మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ సినిమా తీశారు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. అలా విశాల్ కుటుంబంతో చిరంజీవికి తియ్యటి అనుబంధం ఉంది. ఈ సినిమానే ఎస్పీ పరశురామ్. తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ‘ఎస్పీ పరశురామ్’గా రీమేక్ చేశారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
Also Read: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ లేటెస్ట్ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి మెగా హిట్ తర్వాత విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మించిన ఎస్పీ పరశురామ్ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశ పరిచింది. ఈ సినిమా తర్వాత జీకే రెడ్డి తెలుగులో పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. విశాల్ హీరోగా మారిన తర్వాత ఎక్కువ అతడితోనే ఈ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు.
విశాల్ హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్‌గా జీకే ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించిన పందెంకోడి సినిమా సూపర్‌హిట్ అయ్యింది. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే విశాల్‌కు తెలుగులో మార్కెట్ సృష్టించిన సినిమా పందెంకోడి. మూడేళ్ల కిందట పందెంకోడి సీక్వెల్‌ను కూడా తీయగా అది నిరాశపరిచింది.
Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్