Homeఎంటర్టైన్మెంట్BB Jodi 2 new wild cards: 'BB జోడి 2' కి సరికొత్త వైల్డ్...

BB Jodi 2 new wild cards: ‘BB జోడి 2’ కి సరికొత్త వైల్డ్ కార్డ్స్..ఇద్దరు ‘బిగ్ బాస్ 9’ కంటెస్టెంట్స్..ఎవరెవరంటే

BB Jodi 2 new wild cards: ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న ‘BB జోడి 2′(BB Jodi 2) కి ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ షో ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ బిగ్గెస్ డ్యాన్స్ రియాలిటీ షో నుండి ఈ వారం రీతూ చౌదరి, డిమోన్ పవన్ జంట ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. వీళ్ళు ఎలిమినేట్ అయ్యాక, వైల్డ్ కార్డు ద్వారా మరో రెండు జంటలను తీసుకొచ్చారు. అందులో ఒకరు రాము రాథోడ్, మరొకరు పవన్ కళ్యాణ్. ఇందులో ఒకరు ‘బిగ్ బాస్ 9’ నుండి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా, మరొకరు టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఇద్దరికీ డ్యాన్స్ బాగా వచ్చు. ముఖ్యంగా రాము రాథోడ్ ఏ రేంజ్ లో డ్యాన్స్ వేస్తాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ పాటల్లో డ్యాన్స్ వేశాడు, పాటలు కూడా పాడాడు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, గొప్ప డ్యాన్సర్ అని చెప్పలేము కానీ, ఎదో ఉన్నంతలో కాస్త మ్యానేజ్ చేస్తాడు అని మాత్రం చెప్పొచ్చు. అయితే వీళ్లిద్దరికీ జోడిగా ఎవరెవరు వచ్చారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. రాము రాథోడ్ రీసెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ని ఇమ్మానుయేల్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశాడు. అందులో కూడా రాము రాథోడ్ ఎవరికీ జోడిగా వచ్చారు అనేది తెలియలేదు. కచ్చితంగా సీజన్ 9 నుండి అయేషా ఇతనికి జోడీగా వచ్చే అవకాశం ఉంది. ఈమె వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా హౌస్ లోపలకు అడుగుపెట్టి, మధ్యలో ఆరోగ్యం చెడిపోవడం వల్ల ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్ 9’ లో ఆమె ఉన్న ఆ కొద్దీ రోజులు బాగా క్లోజ్ అయ్యింది రాము తోనే, కాబట్టి ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎవరు వచ్చారు అనేది ఇప్పుడు సస్పెన్స్. తనూజ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమెకు ఈ డ్యాన్స్ షోస్ పై ఆసక్తి లేదు. బిగ్ బాస్ 9 లో ఈ జోడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరు ప్రేమికులు అనలేము, అలా అని స్నేహితులు అని కూడా అనలేము. అక్కా తమ్ముడు రిలేషన్ అయితే అసలు కాదు. ఒక స్పెషల్ రిలేషన్ వీళ్ళిద్దరిదీ. ‘BB జోడి 2’ కి వీళ్ళు జంటగా వస్తారని అంతా అనుకున్నారు. కానీ వీళ్లిద్దరు లవర్స్ అంటూ ప్రచారం చేసి, సోషల్ మీడియా లో నెటిజెన్స్ రచ్చ రచ్చ చేయడం లో రాలేకపోయారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి, ఆయనకు జోడీగా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వచ్చే వారం వరకు ఈ సస్పెన్స్ ఎంజాయ్ చేస్తూ ఉండాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version