Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి జోరు ప్రస్తుతం మాములుగా లేదనే చెప్పాలి. కుర్ర హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించి దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇక న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా సదరు చిత్రాల అప్డేట్స్ ఇస్తున్నారు మెగాస్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కాగా… ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఆచార్య మూవీ సెట్స్ పై ఉండగానే చిరు వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించారు.

వాటిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న “భోళా శంకర్” కూడా ఒకటి. ఇటీవలే భోళా శంకర్ ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తి చేసుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ తమిళ హిట్ చిత్రం వేదాళం కి రిమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ చిరు సోదరి రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ భారీ సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ని మూవీ మేకర్స్ రివీల్ చేశారు.
Lets Rejoice this NEW YEAR with #SWAGofBHOLAA 🤘
UNVEILING MEGASTAR SWAG ❤️🔥at 9 AM Tomorrow 😎🔥#BholaaShankar 🔱
MEGA🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @KeerthyOfficial @tamannaahspeaks @dudlyraj @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/ISdQbwnoML
— AK Entertainments (@AKentsOfficial) December 31, 2021
కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 ఉదయం 9 గంటలకు మెగాస్టార్ మాస్ ట్రీట్ ని విట్నెస్ చెయ్యడానికి రెడీగా ఉండమని అలెర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఫస్ట్ లుక్ పోస్టరా లేక గ్లింప్స్ వీడియోనా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా… ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.