MLA Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కుల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కమ్మ, కాపుల మధ్య రాజకీయాలు జోరందుకున్నాయి. మేమే గొప్ప మేం గొప్ప అంటూ బాహాబాహీకి దిగడం తెలిసిందే. ఏపీలో అయితే ఈ టైపు రాజకీయాలు ఎక్కువే. అందుకే కులాల కుమ్ములాటలో ఓట్లు సాధించడం సులువే అని పార్టీలు గుర్తిస్తున్నాయి. ఫలితంగా ఓట్లు రాబట్టుకుంటున్నాయి. మధ్యలో రెడ్డి వర్గం కూడా ఏపీలో బలపడేందుకు జగన్ దోహదం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువగా ఉన్నది వారే అని తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాపు వర్గంలో కూడా పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధాను హతమార్చడానికి రెక్కీ నిర్వహించారనే ఆరోపణ రాష్ర్టంలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాధాను హత్య చేయడానికి వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పడం గమనార్హం.
Also Read: సోము వీర్రాజు కాదు సారాయి వీర్రాజు.. బీజేపీ అధ్యక్షుడిపై పార్టీల చురకలు
వంగవీటి రాధాను వైసీపీ ఇన్ చార్జిగా పదవి ఇచ్చి మళ్లీ తప్పించి టికెట్ ఇవ్వకుండా అవమానించిన జగన్ పై విమర్శలు గుప్పించారు. కాపులను శత్రువుల్లా చూసే జగన్ వారి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ర్టంలో కాపులను అణగదొక్కే విధంగా పార్టీల వైఖరి ఉంటుంది. వంగవీటి రంగాను చంపడం తప్పుకాదని ప్రకటనలు చేసిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించడంలో ఆంతర్యమేటో అర్థం కావడం లేదు. వంగవీటి రాధాను హత్య చేయడానికి వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం ఏమిటని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
రాధా హత్యకు రెక్కీ నిర్వహించిన అరవ సత్యంకు జగన్ ఏ తాయిలాలు ప్రకటించారో తెలియడం లేదని అన్నారు. మొత్తానికి రాష్ర్టంలో కాపులను దగా చేసే విధంగా పార్టీల వైఖరి ఉందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో రాధా హత్యకు కుట్ర చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన హత్యతో ఎదురులేని రాజకీయాలు చేయొచ్చని తెలుస్తోంది. కాపులకు పార్టీలు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెబుతున్నారు.