చైతు – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’లో లొసుగులు ?

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకి లవ్ డ్రామాలను బాగా హ్యాండిల్ చేస్తాడనే నేమ్ ఉంది. కానీ చైతు – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’లో మాత్రం లొసుగులు ఎక్కువైపోయాయి. సినిమా ఫస్ట్ కాపీ చూస్తే గాని, నిర్మాతలకు ఈ విషయం అర్ధం కాలేదు అట. అసలు చైతు, సాయి పల్లవిని ఎందుకు ప్రేమిస్తున్నాడు ? అలాగే సాయి పల్లవి ఏ కారణం లేకుండానే చైతునే తన హీరో అని ఎందుకు ఫిక్స్ అయింది లాంటి లాజిక్ లు […]

Written By: admin, Updated On : August 15, 2020 1:53 pm
Follow us on


సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకి లవ్ డ్రామాలను బాగా హ్యాండిల్ చేస్తాడనే నేమ్ ఉంది. కానీ చైతు – సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’లో మాత్రం లొసుగులు ఎక్కువైపోయాయి. సినిమా ఫస్ట్ కాపీ చూస్తే గాని, నిర్మాతలకు ఈ విషయం అర్ధం కాలేదు అట. అసలు చైతు, సాయి పల్లవిని ఎందుకు ప్రేమిస్తున్నాడు ? అలాగే సాయి పల్లవి ఏ కారణం లేకుండానే చైతునే తన హీరో అని ఎందుకు ఫిక్స్ అయింది లాంటి లాజిక్ లు లేకుండా శేఖర్ కమ్ముల ఈ లవ్ స్టోరీని సెన్స్ లెస్ గా తీసాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్.

Also Read: కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !

నిజానికి ఇలాంటి రూమర్స్ నిజం లేకపోతే రావు. మరీ ఆ లెక్క ప్రకారం చూస్తే.. శేఖర్ కాస్త లవ్ స్టోరీలో ట్రాక్ తప్పినట్లే అనిపిస్తుంది. ఏమైనా శేఖర్ సినిమాలు చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూడొచ్చు. ఇప్పుడు ఇదే బ్రాండ్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆ నమ్మకంతో జనం సినిమా నిరుత్సాహ పడతారట. అయితే ఈ సినిమాకి మాత్రం మంచి డిమాండ్ ఉంది. కరోనా పుణ్యమా అని థియేటర్ లో సినిమా చూసే అవకాశం లేకపోవడం.. ఫ్యామిలీస్ లో శేఖర్ కమ్ముల సినిమాలకు మంచి గిరాకీ ఉండటం, పైగా క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లు కావడం.. మొత్తానికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో లవ్ స్టోరీకి ఫుల్ డిమాండ్ ఉంది.

Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

అందుకే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. జీ5, అమెజాన్ సంస్థలు లవ్ స్టోరీ రైట్స్ కోసం ఇప్పటికే భారీ ఫిగర్ కోడ్ చేసాయి. కానీ మేకర్స్ మాత్రం మిగిలి ఉన్న సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ను పూర్తి చేసి.. సినిమాని అమ్మాలనుకున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ గా వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో నిర్మాణ రంగంలోకి దిగింది. మంచి ఆఫర్ వచ్చినప్పుడే అమ్ముకోవడం బెటర్. ఈ విషయం శేఖర్ కి బాగానే తెలుసు. ఆయనైనా నిర్మాతలకు చెబుతాడేమో చూడాలి.