
‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమా పై ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదట. సహజంగానే పవన్ హిట్ ప్లాప్ లను పెద్దగా పట్టయించుకోడు. దానికి తోడు పవన్ ఇప్పుడు సినిమాలు చేస్తుందే అయిష్టంగా. కాబట్టే పవన్ అసలు ఇప్పుడు చేస్తోన్న సినిమాల పరిస్థితి గురించి, వాటి అప్ డేట్స్ కి సంబంధించి ఎప్పుడు మాట్లాడట్లేదు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో ఒకింత క్కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ఒకవేళ పవన్ అయిష్టతతోనే సినిమా చేయడానికి ప్రిపేర్ అయ్యాడా అనే అనుమానం వాళ్ళల్లో కలుగుతుంది. అదే నిజం ఆయితే ఆ ఎఫెక్ట్ పవన్ యాక్టింగ్ పై పడే ఛాన్స్ ఉంది.
Also Read: అలా పెంచేస్తే ఎలా సమంత?
అయినా ఒకపక్క పవన్ రాజకీయపరమైన పనుల్లో పడి పూర్తిగా తన సినిమాల పై ఆయన ఆలోచించడమే మానేశారు. మరి ఇలాంటి సిట్యుయేషన్ లో పవన్ పూర్తి ఎఫెక్ట్స్ పెట్టి సినిమా చేయడం దాదాపు కష్టమే. పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల బెటర్ అవుట్ ఫుట్ కోసం తానూ పర్సనల్ గా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అసలు పవన్ సినిమా హిట్ అవుతుందా.. లేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తోందా అని పవన్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
Also Read: కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !
ఎందుకంటే పవన్ రీఎంట్రీ సినిమా ప్లాప్ అయితే, ఆ ప్రభావం జనసేన పార్టీ మీద కూడా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వడం కష్టం అనే అనుమానాలు పవన్ ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. కలయిక చూస్తుంటే భారీగా ఉంది గానీ, సినిమా పై మాత్రం ఎవ్వరికీ నమ్మకం లేదు. అన్నట్టు ప్రెజెంట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నా.. సాంగ్స్ జనానికి పెద్దగా ఎక్కడం లేదాయే.