సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫేమస్, సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో అక్కినేని సమంత ముందుంటుంది. ఆ స్థాయిలో ఆమె ఖాతాలో విజయాలున్నాయి. పెళ్లయ్యాక ఆమె అదృష్టం పెరిగింది. చేసిన ప్రతీ సినిమా హిట్టవుతోంది. అక్కినేని కోడలుగా మారిన తర్వాత కథలు, పాత్రల ఎంపికలో సమంత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తోంది. అదే టైమ్‌లో ప్రయోగాలకూ వెనుకాడడం లేదు. కథ, సన్నివేశం డిమాండ్ చేస్తే లిప్‌లాక్స్‌కు వెనుకాడబోనని ‘రంగస్థలం’ సినిమాతో స్పష్టం చేసింది. కరోనా రాకతో సినిమాలు ఆగిపోవడంతో సమంత హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితం అయింది. భర్త నాగచైతన్యతో సమయం ఆస్వాదిస్తోంది. తమ ఇంట్లో సేంద్రీయ కూరగాయలు పండిస్తోంది.
Also Read: కరోనా.. టాలీవుడ్ కి శుభసూచికమే !
‘జాను’ తర్వాత మరే సినిమాకు సమంత సంతకం చేయలేదు. అయితే, కరోనా నేపథ్యంలో ఇతర నటీనటులు పారితోషికం తగ్గించుకుంటుండగా అక్కినేని కోడలు మాత్రం అందుకు భిన్నమైన మార్గం ఎంచుకుంది. తన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిందట. ఒక్కో సినిమాకు మూడున్నర కోట్ల రూపాయాలు డిమాండ్ చేస్తోందని సమాచారం. ఈ విరామ సమయంలో కొన్ని కథలతో పలువురు దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం సమంత అస్సలు వెనక్కు తగ్గడం లేదట. రూ. 3.5 కోట్ల అయితేనే తనకు గిట్టుబాటు అవుతోందని స్పష్టం చేస్తోందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సమంత నటించిన ఓ బ్లాక్‌బస్టర్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన ఓ ప్రొడక్షన్ హౌజ్ రీసెంట్‌గా ఓ స్క్రిప్ట్ తో ఆమెను సంప్రదించింది. కానీ, సమంత డిమాండ్ విని కంగుతిన్నదట. ఈ పరిస్థితుల్లో ఇలా పెంచేస్తే ఎలా? అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్‌కే అంత భారీ మొత్తం ఇస్తే తమకు వర్కౌట్ అవదని నిర్ణయానికి వచ్చిన సదరు నిర్మాతలు వేరే హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నారట.
Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !
సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే హిందీ వెబ్ సిరీస్ రెండో సీజన్ తొందర్లోనే విడుదల కానుంది. అది రిలీజైతే దక్షిణాదిలో కూడా సమంత పేరు మార్మోగుతుందని పలువురు భావిస్తున్నారు. అదే జరిగితే సామ్ తన పారితోషికాన్ని మరింత పెంచిన ఆశ్చర్య పోనక్కర్లేదు.