Hari Hara Veeramallu : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి రావడం కోసం తీవ్రమైన ప్రయత్నమైతే చేశారు. కానీ ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి తన అభిమానులకు గాని
జనాలకు గానీ ఎలాంటి ఆపద వచ్చిన సరే తను ఆదుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు… అలాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన మార్కు చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan)… ఆయన కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా ఏడు విజయాలను అందుకొని ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఆయనను స్టార్ హీరో రేంజ్ లో కూర్చోబెట్టాయి. ఇక దానికి మించి ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలను చేపడుతుండడం చాలామందిని అడుకోవడంతో వ్యక్తిత్వపరంగా కూడా అతనికి అభిమానులుగా మారిన ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని తొందర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద కొన్ని డేట్స్ ని కూడా కేటాయించారట. ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో ఏ ఏమ్ రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ (Jyothi Krishna) ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే తను ఆక్సిజన్ రూల్స్ రంజన్ లాంటి సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేదాని కోసమే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. తద్వారా ‘మహా శివరాత్రి’ కానుకగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో రిలీజ్ డేట్ ని పక్కాగా కన్ఫర్మ్ చేసి ప్రేక్షకుల ముందు ఉంచడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది తద్వారా ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయబోతుంది అనేది తెలుసుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…