
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి ఫస్ట్ నోటీసు అంటూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. లైక్స్ అండ్ షేర్ లతో ట్రెండ్ సెట్ చేస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ట్విట్టర్ లో 24 గంటల్లో ఎక్కువ లైక్స్ అనగా 95.6 వేల లైక్స్ ను సొంతం చేసుకున్న పోస్టర్ గా రికార్డ్ ను సెట్ చేసింది.
అలాగే ఈ పోస్టర్ ఎక్కువ రీట్వీట్స్ అనగా 49.1 వేల రీట్వీట్స్ తో మరో రికార్డ్ ను సెట్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఈ పోస్టర్ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేయడం విశేషం. ఇక ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు ఉండటంతో చిత్ర యూనిట్ ఆ రోజున స్పెషల్ టీజర్ ను ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ప్రేక్షకులకు, మహేష్ అభిమానులకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ఫుల్ కిక్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతుంది.
Super@urstrulyMahesh
#SVPFirstNotice Becomes the MOST LIKED & RETWEETED Poster of TFI on Twitter in 24hrs
#SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/N03qYrIssD— SarkaruVaariPaata (@SVPTheFilm) August 1, 2021
కాగా హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ షూట్ లో మహేష్ తో పాటు కీర్తి సురేష్, వెన్నల కిషోర్ కూడా పాల్గొన్నారట. కామెడీ సీన్స్ తీస్తున్నారు. వచ్చే వారం నుండి ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడు. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా సాగుతోంది.
అందుకే, ఈ నెల నుండి బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.