Radhe Shyam Trailer: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అప్ డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. చివరకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కాగా ప్రేక్షకులు ఈ సినిమా ట్రైలర్ పై ఇంకా ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో రాధే శ్యామ్ హిందీ ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ అందుకుంది. ఇదే గొప్ప రికార్డు అనుకుంటే.. ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డును కూడా అందుకుంది.

ఈ సినిమా ట్రైలర్.. ఎక్కువమంది ప్రేక్షకులు చూసిన ట్రైలర్ గా కూడా ఇది రికార్డు క్రియేట్ చేసింది. పైగా తన రెండు సినిమాల ట్రైలర్స్ కు 1 మిలియన్ లైక్స్ సాధించాడు ప్రభాస్. గతంలో సాహో సినిమాకు కూడా ఈ రికార్డు క్రియేట్ చేశాడు. హీరోగా ప్రభాస్ ఖాతాలో పడిన మరో ఘనత ఇది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దానికి కారణం ట్రైలర్ లో అన్ని రకాల ఎమోషన్స్ ఉండటం. ‘అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా జీవితంలో లో ప్రేమ పెళ్లి లేవు’ అంటూ ప్రభాస్ వాయిస్ తో ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. ఇక ‘ప్రేమ పెళ్లి లేవు’ అంటూనే.. ఇంట్రెస్ట్ గా కనిపించిన అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే కుర్రాడిగా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. టాల్ బ్యూటీ పూజా హెగ్డే (ప్రేరణ) ఎంట్రీ కూడా అదిరిపోయింది.
Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?
‘నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు..’ అంటూనే పూజా హెగ్డే పై ప్రేమను కురిపిస్తూ ఆమెను ప్రేమలో పడేశాడు ప్రభాస్. పైగా ‘కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం, కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం’ అని ప్రభాస్ చెప్పడంతో ట్రైలర్ మలుపు తిరిగింది. ప్రభాస్ – పూజా హెగ్డే ప్రేమకథలో జ్యోతిష్యం కీలక పాత్ర పోషించబోతున్నట్లు, ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందనే సెన్స్ తో కొన్ని షాట్స్ పడ్డాయి.
ఏది ఏమైనా ‘రాధే శ్యామ్’ ట్రైలర్ లో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. దాంతో హిందీ జనం ఈ ట్రైలర్ ను తెగ ఇష్టపడుతున్నారు. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా వంశీ – ప్రమోద్ – ప్రసీద – భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read: స్పిరిట్ మూవీ లో ప్రభాస్ రోల్ ఏంటో తెలిసిపోయిందోచ్… సీక్రెట్ రివీల్ చేసిన నిర్మాత ఎవరంటే ?