Peddi Movie New Poster: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan) ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చిన రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రిపోస్టర్ లో వినాయక చవితికి కలుద్దాం అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి వినాయక చవితికి టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. తద్వారా ఈ సినిమాకి ఎక్కడలేని హైపైతే వచ్చింది. ఇక బుచ్చిబాబు ఇంతకుముందు చేసిన ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి అతని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.
రీసెంట్ గా రాంచరణ్ తన బాడీని బిల్డ్ చేస్తూ ఒక ఫోటో నైతే రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో అద్భుతంగా ఉన్న రామ్ చరణ్ ని చూస్తున్న వాళ్లంతా పెద్ది సినిమా కోసమే ఆయన ఇలా బాడీని బిల్డ్ చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు…ఈ సినిమాతో కనక రామ్ చరణ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నవాడు అవుతాడు.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!
లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. తన తోటి హీరోలందరూ 2000 కోట్ల మార్కును అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఇంకా 1200 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. కాబట్టి తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది…