Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Crazy Look: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ...

Ustaad Bhagat Singh Crazy Look: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!

Ustaad Bhagat Singh Crazy Look: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తుండగా… లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు టీమ్. దాంతో పాటు సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీక్ చేశారు. సదరు ఫోటో వైరల్ అవుతుంది. ఇంతకీ టీం ఇచ్చిన అప్డేట్ ఏమిటో చూద్దాం..

Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!

హరి హర వీరమల్లు థియేటర్స్ లో సందడి చేస్తుండగా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఓ జీ చిత్రీకరణ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అనేది పవన్ కళ్యాణ్ భావన. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. వీరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. 2012లో గబ్బర్ సింగ్ మూవీతో పవన్-హరీష్ బ్లాక్ బస్టర్ కొట్టారు.

గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు స్పెషల్ మూవీ. ఆ మూవీలో పవన్ మేనరిజం, వన్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి. మైండ్ బ్లాక్ చేసే సన్నివేశాలతో హరీష్ శంకర్ ఫ్యాన్స్ కి మరచిపోలేని ట్రీట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ విడుదలై దశాబ్దం దాటిపోగా… ఈ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తో వారి కోరిక నెరవేరింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా తలమునకలు కాగా… ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చేశారు.

Also Read: AM రత్నం ఎలాంటి సినిమాలు తీశాడో తెలుసా..? ఆయన హిస్టరీ చూస్తే హడల్!

దాంతో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి తప్పుకున్నాడు. మూవీ ఆగిపోయిందని పుకార్లు చెలరేగాయి. అవన్నీ నిరాధార కథనాలే అని అనంతరం క్లారిటీ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ఫ్యాన్స్ కి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. స్టంట్ మాస్టర్ నబకంఠ పర్యవేక్షణలో అద్భుతమైన క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి చేశారట. క్లైమాక్స్ సీన్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కలిగి ఉంటుందట. పనిలో పనిగా సెట్స్ నుండి పవన్ లుక్ రిలీజ్ చేశారు. సూపర్ స్టైలిష్ గా ఉన్న పవన్ లుక్ ఫ్యాన్స్ కి ట్రీట్.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాది చివర్లో లేదా… వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం కలదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. హిట్ కాంబో సిల్వర్ స్క్రీన్ పై ఆ మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular