అమీర్ లైఫ్లోకి కొత్త అమ్మాయి..? అందుకే కిరణ్ సైడ్ కు..!

బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల సంచలనంగా వార్తల్లోకెక్కాడు. ఆయన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. తామిద్దరం మర్యాదపూర్వకంగానే విడిపోతున్నామని, అయితే తమ బాబు బాగోగులను ఇద్దరం కలిసి చూసుకుంటామని కిరణ్ రావ్ ప్రకటించింది. అయితే అమీర్ ఖాన్ ట్యాగులతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. అమీర్ ఖాన్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడా..? అని […]

Written By: NARESH, Updated On : July 4, 2021 2:24 pm
Follow us on

బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల సంచలనంగా వార్తల్లోకెక్కాడు. ఆయన భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. తామిద్దరం మర్యాదపూర్వకంగానే విడిపోతున్నామని, అయితే తమ బాబు బాగోగులను ఇద్దరం కలిసి చూసుకుంటామని కిరణ్ రావ్ ప్రకటించింది. అయితే అమీర్ ఖాన్ ట్యాగులతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు. అమీర్ ఖాన్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడా..? అని పోస్టులు పెడుతున్నారు.

తాజాగా ఆమెర్ లైఫ్లోకి కొత్త అమ్మాయి వచ్చిందంటున్నారు. ఆమె ఎవరో కాదు దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా. ఈ సినిమాలో కూతురిగా నటించిన ఫాతిమా ఆ తరువాత థగ్స్ ఆఫ్ హిందుస్ఠాన్లో అమీర్ ఖాన్ తో జోడీ కట్టింది. ఆ తరువాత కూడా వీరిద్దరు కలిసి తిరిగారు. ఓ సినిమా ఫంక్షన్లో ఇద్దరు కలిసి కెమెరాలకు చిక్కారు. ఆ తరువాత అమీర్ ఖాన్ ఇంటికి ఫాతిమా ఎక్కువగా వెళ్లేదట.

ఈ నేపథ్యంలో ఫాతిమా వ్యవహారంతోనే కిరణ్ రావ్ అమీర్ ఖాన్ తో తెగదెంపులు చేసుకుందని అంటున్నారు. ఇక ట్రోలింగ్ ను చూసిన అమీర్ ఖాన్ పట్టించుకోలేదు. అయితే ఫాతిమ మాత్రం ఇలా పోస్టులు పెట్టడం సరికాదు అని చెప్పింది. ఇక అమీర్ ఖాన్ కు ఫాతిమా మధ్య ఎఫైర్ ఉన్నట్లు తమ భావస్వేచ్ఛ హక్కు అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

గతంలో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు దేవం విడిచి వెళ్లిపోవాలని ఉందని అంటే కొందరు ప్రశ్నించారు. దీనిపై భావస్వేచ్ఛ హక్కు ద్వారా మాట్లాడుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కూడా అదే భావస్వేచ్ఛ హక్కుతో మేం పోస్టులు పెడుతున్నామని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. మా పోస్టులను, కామెంట్లను ఎవరూ అడ్డుకోలేరు అని అంటున్నారు.