https://oktelugu.com/

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరో కి, ఆయన భార్య కి కరోన పాజిటివ్… ఎవరంటే ?

Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. ఓ వైపు ఓమిక్రాన్ కమ్ముకొస్తున్న తరుణంలో… లాక్ డౌన్లు, ఆంక్షల మధ్య ఇప్పటికే బాలీవుడ్ చాలా దెబ్బతింది. దీనికి తోడు వరసగా పలువురు బాలీవుడ్ యాక్టర్లు కోవిడ్ బారిన పడుతుండటం ఇండస్ట్రీని కలవరపరుస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కు కరోనా పాజిటివ్ గా తేలింది. జాన్ అబ్రహంతో పాటు ఆయన భార్య ప్రియా రుంచల్ కు కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 12:36 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు. ఓ వైపు ఓమిక్రాన్ కమ్ముకొస్తున్న తరుణంలో… లాక్ డౌన్లు, ఆంక్షల మధ్య ఇప్పటికే బాలీవుడ్ చాలా దెబ్బతింది. దీనికి తోడు వరసగా పలువురు బాలీవుడ్ యాక్టర్లు కోవిడ్ బారిన పడుతుండటం ఇండస్ట్రీని కలవరపరుస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కు కరోనా పాజిటివ్ గా తేలింది. జాన్ అబ్రహంతో పాటు ఆయన భార్య ప్రియా రుంచల్ కు కూడా కరోనా సోకింది. అయితే ఇప్పటికే తామిద్దరం వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా జాన్ అబ్రహం వెల్లడించారు. తమకు కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా ఆయన తెలియజేశాడు.

    ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు, సినిమా స్టార్స్, స్టోర్ట్స్ పర్సన్లకు కోవిడ్ సోకింది. ఇటీవల కరీనా కపూర్‌కు, షనయా కపూర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. మరో వైపు బీసీసీఐ ప్రెసిడెంట్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువరు రాజకీయ నేతలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా కోవిడ్ కల్లోలం కలిగించింది.

    ఏకంగా 10 మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ సోకింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్క్ లు ధరించి, శానిటైజర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు గుర్తిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలని వైద్య అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జాన్ అబ్రహాం కొరణ నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.