Adi Reddy: డబ్బులు దానికే ఇస్తాను.. మా ఇంటికి రావద్దు.. బిగ్ బాస్ ఆదిరెడ్డికి కొత్త కష్టాలు

ఒకప్పుడు బెంగళూరులో చిన్న జాబ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఆది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఫుల్ గా సంపాదిస్తున్నారు. అయితే ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఆదిరెడ్డి రివ్యూవర్ గా మారి ఆర్థికంగా సెటిల్ అయ్యారు.

Written By: Swathi Chilukuri, Updated On : January 31, 2024 1:05 pm
Follow us on

Adi Reddy: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందు ఆదిరెడ్డి ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. బిగ్ బాస్ ఆదిరెడ్డి జీవితాన్ని మార్చేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కంటే ముందు కూడా బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు.

ఒకప్పుడు బెంగళూరులో చిన్న జాబ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ఆది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఫుల్ గా సంపాదిస్తున్నారు. అయితే ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఆదిరెడ్డి రివ్యూవర్ గా మారి ఆర్థికంగా సెటిల్ అయ్యారు. అంతేకాదు ప్రస్తుతం అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆదిరెడ్డి తరచూ ఏదొ ఒక విషయంతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

ఆదిరెడ్డికి రీసెంట్ గా ఒక సమస్య వచ్చి పడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిరెడ్డి. ఈ విషయంపై అభిమానులకు విజ్నప్తి చేశారు. తమ ఇంటికి ఎవరు అలా రావద్దంటూ రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను వదిలారు. ఇంతకు అందులో ఏముందంటే.. దయచేసి అర్థం చేసుకోండి. నాకు తోచిన సహాయం చేస్తున్నాను. వీలైనంత సాయం చేస్తూనే ఉంటాను. కానీ డైరెక్ట్ గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. ఇలా వచ్చే అందరికీ నేను ఏం చేయగలను చెప్పండి.

ఎవరు వచ్చిన ఒకరోజు భోజనం పెట్టించగలను. కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరూ కూడా ఇంటికి, సెలూన్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాదనీ అందరికి చేయలేను కదా. ఎలాగో ఒకల వచ్చిన వారికి ఛార్జీలకు ఇచ్చి పంపుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే మెసేజ్, కామెంట్స్ ద్వారా తెలియజేయండి అంటూ కోరారు ఆదిరెడ్డి.