Barrelakka: పల్లవి ప్రశాంత్ తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఫీల్ అవలేదని.. త్వరలో జరగనున్న లోక్ సభ ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని టాక్. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Written By: Swathi, Updated On : January 31, 2024 1:10 pm

Barrelakka

Follow us on

Barrelakka: శిరీష అనే పేరు కంటే బర్రెలక్క అంటే ప్రతి ఒక్కరు గుర్తు పడుతారు. బర్రెలు కాస్తున్నా అంటూ కోవిడ్ టైమ్ లో ఓ వీడియో చేసి చాలా ఫేమస్ అయింది శిరీష. రీసెంట్ గానే ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో తన పేరును మారుమోగేలా చేసుకుంది. కానీ ఆశించిన ఫలితం రాలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష అందరూ షాక్ అయ్యే విషయాలను తెలియజేసింది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకోండి.

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఫీల్ అవలేదని.. త్వరలో జరగనున్న లోక్ సభ ఎంపీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని టాక్. అయితే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనతో శిరీష పెళ్లి అంటూ ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై స్పందించింది బర్రెలక్క. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత తను కనీసం కాల్ కూడా చేయలేదట. వీరిద్దరి పెళ్లి గురించి వచ్చే వార్తలను తను వినలేదు అని తెలిపింది.

వ్యూస్ కోసం ఈ విధంగా రాస్తున్నారని..అలాంటి యూట్యూబ్ ఛానెల్స్ ఇంప్రెషన్ పోగొట్టుకుంటున్నారని తెలిపింది. అయితే తాను ప్రశాంత్ ను అన్న అని పిలుస్తుందంటా.. అన్నని ఎవరు అయినా పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించింది బర్రెలక్క. అయితే తాను ఏ యూట్యూబ్ ఛానెల్ పై స్ట్రైక్ గానీ, కాపీ రైట్ గానీ వేయలేదని వెల్లడించింది. ఇక పొలిటికల్ గా తన ప్రయాణం ఆపను అని తెలిపింది. మంచి పని చేసే వారికి కచ్చితంగా మీడియా నుంచి సపోర్ట్ వస్తుందని పేర్కొంది శిరీష.

అయితే తాను హైదరాబాద్ లో బీఈడీ చదువుకుందట. అయితే తనకు ఫ్యూచర్ లో ఏం చేయాలో ప్లానింగ్ కూడా ఉందని తెలిపింది. ప్రజలు కనీసం సర్పంచ్ లను గట్టిగా అడగడానికి భయపడుతారని.. బయట ఏదైనా సంఘటన జరిగితే స్పందించరు కానీ ఇలాంటి వాటికి వెంటనే స్పందిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బర్రెలక్క.