Ladakh Shepherds: ఆ మధ్య నిఘా బెలూన్ లను తయారుచేసి భారత్, అమెరికా, జపాన్ వంటి దేశాల మీదుగా చైనా ఎగరవేసింది. ఆయా దేశాలకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని సేకరించింది.. సహజంగా ఇలాంటిది తప్పు అని అందరికీ తెలుసు. కానీ చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతటి పన్నాగానికైనా దిగజారుతుంది. అలాంటి చైనా వల్ల ఎన్నో దేశాలు నాశనమయ్యాయి. మరెన్నో దేశాలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాయి. అక్కడి దాకా ఎందుకు ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ లాంటి వైరస్ పుట్టుకకు చైనా దేశమే కారణం. కానీ అలాంటి చైనా.. అంగ బలంలో, అర్థబలంతో ప్రపంచాన్ని సైతం శాసించగల సత్తా ఉన్న ఆ దేశం.. గొర్ల కాపరుల ముందు తలవంచింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం ఆ దృశ్యం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
హిమాలయ పర్వత సాణువుల్లో చైనా కదలికలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పైగా అక్సాయ్ చిన్ లాంటి ప్రాంతాల్లో చైనా ఎప్పటినుంచో పాగా వేసింది. ఇంకా మరిన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా తన బలగాలను ఎప్పటికప్పుడు అక్కడికి పంపిస్తూ ఉంటుంది. చైనా దురాగతాన్ని మన దేశం ఎప్పటికప్పటికీ తిప్పికొడుతున్నప్పటికీ డ్రాగన్ తన పద్ధతిని మార్చుకోదు. ఇక ఇటీవల తూర్పు లడాఖ్ లోని వివాదాస్పద ఎల్ ఏ సి వద్ద చైనా భారీగా సైనికులను మొహరింపజేసింది. వారు ఆయుధాలతో ఇటువైపు వస్తుండగా గొర్రెల కాపరులు అడ్డుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉంటాయి. ఆ నేలల్లో విస్తారంగా పచ్చిగడ్డి ఉంటుంది. స్థానికంగా ఉండే గొర్రెల కాపరులు తమ గొర్రెలను ఆ ప్రాంతంలో మేపుతుంటారు. గొర్లు ఆ ప్రాంతంలో మేత మేడాన్ని చైనా సైనికులు అడ్డుకున్నారు. దీంతో గొర్రెల కాపరులు చైనా సైనికులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. అంతేకాదు ధైర్యంగా చైనా సైనికులను బయటికి వెళ్లగొట్టారు.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లులు కొడుతోంది.
ఇక ఈ లడాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, చైనా సైనికుల మధ్య అక్కడ ఘర్షణ జరుగుతోంది. వివాదాస్పద ఎల్ ఏ సి వద్ద లాడాఖ్ గొర్రెల కాపరులు (Ladakh Shepherds) తమ గొర్రెలను మేత మేపేందుకు తీసుకెళ్లారు.. అయితే ఆ ప్రాంతంలో పొంచి ఉన్న చైనా సైనికులు గొర్రెల కాపరులను అడ్డుకున్నారు. ఇక్కడ గొర్రెలను మేపేందుకు అనుమతి లేదని వారితో వాగ్వాదానికి దిగారు.. ఆ గొర్రెల కాపరులు ధైర్యంగా చైనా సైనికులను అడ్డుకున్నారు. అంతేకాదు మేము ఇక్కడ గొర్రెలను ఎప్పటినుంచో మేపుతున్నాము. అడ్డు కోవడానికి మీరెవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో చైనా సైనికులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక 2020లో గాల్వాన్ సంఘటన తర్వాత ఎల్ఈసి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా చైనా సైనికులను గొర్రెల కాపరులు ఎదిరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. గాల్వాన్ ఘటన తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఎల్ఏసీ వద్ద గొర్రెలను మేపడాన్ని నిషేధించారు. అయితే తాజాగా గొర్రెల కాపరులు తమ గొర్రెలను అక్కడ మేపడం ప్రారంభించారు.” ఇది మా నేల. ఇక్కడ మా గొర్రెలను మేము మేపుకుంటాం. అడ్డు కోవడానికి మీరెవరు” అంటూ చైనా సైనికులను గొర్రెల కాపరులు నిలదీశారు..కాగా, ఈ సంఘటన పాన్ గాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద జరిగింది.
Here is the video of the local #Ladakhi shepherds engaging the chinese #PLA most evidently in #easternladakh.
The shepherd is seen using the traditional #yukdo to pelt stone at the chinese styled humvee.
would recommend yukdo training for all those posted in Ladakh pic.twitter.com/gDguMXXnst— Namgyal (@Stanzinnamgail_) January 31, 2024