మంచు లక్ష్మీ సహజంగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి.. తన అభిప్రాయాలను ట్వీట్స్ రూపంలో తెలియజేస్తోంది. అయితే, ఆమె ట్వీట్స్ ఒక్కోసారి వైరల్ అవ్వడం, దాంతో మంచు లక్ష్మీ పై నెటిజన్లు ట్రోలింగ్ కి దిగడం ఒక ఆనవాయితీ అయిపోయింది. అయినా తనకు సంబంధం లేని విషయం గురించి తనదైన శైలిలో మంచు లక్ష్మీ వెరైటీగా స్పందించడం,
అది కాస్త వివాదాస్పదం అవ్వడమే ఈ మధ్య తరుచూ జరుగుతుంది. ఏది ఏమైనా ఛాన్స్ వస్తే చాలు, నెటిజన్లు మంచు లక్ష్మీని అసలు వదలడం లేదు. తాజాగా మంచు లక్ష్మీని మరోసారి నెటిజన్లు ట్రోల్ చేశారు. గత వారం కేటీఆర్ గురించి మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమెను నెటిజన్లు రెండు రకాలుగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా మంత్రి స్థానంలో ఉన్న కేటీఆర్ ను బడ్డీ అంటూ పిలవడం మరీ కామెడీ అయిపోయింది.
పైగా కేటీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో మంచు లక్ష్మీని ఏకిపారేశారు అనుకోండి. కేటీఆర్ ను తన సినిమాలు చూడమని మంచు లక్ష్మి కోరడం, నీ సినిమాలు చూసే కంటే.. కరోనాయే బెటర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొత్తానికి మంచ లక్ష్మి బాగా హర్ట్ అయింది. అందుకే తన మీద వచ్చిన ట్రోలింగ్ కు మేరకు ట్రోలర్స్ పై ఆమె విరుచుకుపడింది. షిట్ అంటూ వారిని దారుణంగా తిట్టిపోసింది.
అయితే తాజగా మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఆమె ట్వీట్ పై నెటిజన్లు మళ్ళీ భగ్గుమంటున్నారు. ఈ ఉదయాన్నే టెక్విలా (మందు) మూడు షాట్స్ వేసుకున్న తరువాత ఎవరైనా బ్లాక్ కాఫీ తాగుతారా ? అంటూ మంచు లక్ష్మి తన అభిరుచి మేరకు ఒక ట్వీట్ పడేసింది. మొత్తమ్మీద మంచు లక్ష్మీ తాగడం గురించి ట్వీట్ చేయడంతో.. ఒకపక్క ఆక్సిజన్ దొరక్కా ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతుంటే.. ఇలాంటి ట్వీట్లు వేస్తావా ? అంటూ నెటిజన్లు ఆమె సీరియస్ అవుతున్నారు.