Rithu Chowdary: జబర్దస్త్ లేడీ కమెడియన్ గా రీతూ చౌదరి పాపులర్. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లో సీరియల్స్ లో నటించింది. అక్కడ ఆమెను ఎలాంటి ఫేమ్ రాలేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆదితో పాటు కొందరు టీమ్ లీడర్స్ తో పనిచేసింది. జబర్దస్త్ బాగా రీచ్ ఉన్న షో కావడంతో రీతూ చౌదరికి గుర్తింపు దక్కింది. ఇక బుల్లితెర మీద అడపాదడపా షోలలో కనిపిస్తుంది.
నటిగా ఎదగాలనేది రీతూ చౌదరి కోరిక. అందుకే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. పరిశ్రమలో దర్శక నిర్మాతల కంట్లో పడాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ తప్పనిసరి. ఈ కారణంగా ఆఫర్స్ దక్కుతాయని నటులు భావిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా గతంలో ఆమె టైట్, జీన్స్ టాప్ ధరించి ఓ వీడియో చేసింది. సదరు టాప్ లో ఆమె లుక్ బోల్డ్ గా ఉంది. రీతూ చౌదరి వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి.
నీలాంటి వాళ్ళు చిన్న పిల్లలను చెడగొడుతున్నారు. దీని ఎఫెక్ట్ నీకు పెళ్లి అయ్యాక తెలుస్తుందని ఒకరు కామెంట్ చేశాడు. మరొకరు అమ్మానాన్నల పేర్లు చెడగొడుతుందని కామెంట్ చేశారు. ఇంకొక నెటిజన్… నీకు రూ. 5000 ఇస్తాను మంచి డ్రెస్ కొనుక్కో అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ని రెండు వందలకు పైగా నెటిజెన్స్ లైక్ చేశారు. కొందరు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు.
అయితే నెటిజెన్స్ కామెంట్స్ ఇబ్బంది పెట్టేవిగా ఉన్నా రీతూ చౌదరి స్పందించలేదు. చూసి చూడనట్లు వదిలేసింది. ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ వీడియోలు, ఫోటోలు పెట్టడం వెనుక మరొక కారణం కూడా ఉంది. ఇంస్టాగ్రామ్ తో మంచి ఆదాయం సమకూరుతుంది. వీరి ఇన్కమ్ ఫాలోవర్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా తగ్గడం లేదు.