Homeఎంటర్టైన్మెంట్అనసూయ కొత్త స్టిల్స్ పై నెటిజన్లు ఫైర్

అనసూయ కొత్త స్టిల్స్ పై నెటిజన్లు ఫైర్

Anchor Anasuya
ఎప్పుడూ హాట్ నెస్ తో హాట్ హాట్ గా కనిపించే అనసూయ భరద్వాజ్‌.. తాజాగా చిన్నపిల్లలా మారిపోయి మరీ ఫోటోలకు ఫోజులివ్వడం ఆమె రసిక అభిమానులకు అంతగా రుచించలేదు. అనసూయలో వాళ్ళు చిలిపితనాన్ని ఇష్టపడతారు గాని, చిన్న తనాన్ని మాత్రం ఇష్టపడరట. కానీ ఇవ్వేమి ఆలోచించని అనసూయ కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయినట్లు రెండు జడలు వేసుకుని మరీ పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ చక్కగా చిన్నపిల్లలా మంచి స్టిల్స్ తీయించుకుంది.

పైగా ఆ చిన్నతనం ఎలివేట్ అవుతున్న ఫోటోలతో ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ.. ‘నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో తనలోని అల్లరి తనాన్ని చాటుకుంది. కాకపోతే ఈ హాట్ యాంకర్ అల పోస్ట్ చేయడం, అలాగే ఆమె నుండి ఇలాంటి డీసెంట్ ఫొటోలను అంగీకరించలేని ఆమె అభిమానులు ఆమె పై మండిపడుతున్నారు. చిన్న పిల్లలా మారవు సరే.. మరి స్కూల్‌ బ్యాగ్‌ వేసుకోవడం మర్చిపోయవా ? అంటూ ఒకరు,

కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతూ… ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, నీకు కాస్తైనా బాధేయడం లేదా ? అంటూ మరొకరు అనసూయ పై సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది ? అంటూ నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలో న్యాయం ఉంది. అయినా తన ఎమోషన్ ను, అలాగే తన హాట్ నెస్ ను తప్ప, జనం ఫీలింగ్స్ గురించి అనసూయ పెద్దగా పట్టించుకోదు అనుకోండి.

ఏది ఏమైనా అనసూయ ఇప్పుడీ ఈ ఫొటోలు పోస్ట్‌ చేయడం పై నెటిజన్లు కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే, ఈ కామెంట్స్ కి అనసూయ కూడా ఎప్పటిలాగే తన శైలిలో కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం అంటూ సమాధానం ఇచ్చింది. కానీ పలువురు నెటిజన్లు అనసూయ ఆన్సర్‌ ను విబేధిస్తున్నారు. ఇలాంటి ఎస్కెప్ సమాధానంతో ఎవ్వరూ సంతృప్తి చెందరని సదరు నెటిజన్‌ కూడా అనసూయ పై రెచ్చిపోయాడు.

https://www.instagram.com/itsme_anasuya/

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version