NBK 107: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అఖండ. ఇప్పటికే ఈ సినమా నుంచి వచ్చిన టీజర్, పాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవలే విడుదల చేసిన భం భం అఖండ పాట.. అభిమానులకు ఓ ఊపు పుట్టించింది. కాగా, ఇదే జోరుతో వరుసగా సినిమాకు ఓకే చెప్తూ ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. శృతీ హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినమాకు ఎట్టకేలకు ముహూర్తం కుదురింది. ఈ నెల 13 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

అఖండ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ 107వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాస్ మసాలా అంశంతో ఈ చిత్రం రూపొందించనున్నారు. క్రాక్ సినిమాతో ఘన విజయాన్న సొంతం చేసుకున్న గోపించంద్ మలినేని.. పూర్తిస్థాయిలో ఆసక్తికర స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
అఖండ సినిమాలో ప్రగ్నా జైశ్వాల్ హీరోయిన్, నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా, శ్రీకాంత్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా విడుదల చేయనుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.