Pooja Hegde: స్టార్ లేడీ పూజా హెగ్డే త్రో బ్యాక్ ఫోటో అంటూ టెంపరేచర్ పెంచేసింది. బికినీలో దర్శనమిచ్చి మైండ్ బ్లాక్ చేసింది. సాగరతీరంలో సేదతీరుతున్న పూజా గ్లామరస్ ఫోటో ఇంస్టాగ్రామ్ ని ఊపేస్తుంది. పూజా బికినీ ఫోజ్ క్షణాల్లో వైరల్ కాగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లిన పూజా హెగ్డే అప్పుడు దిగిన ఫోటో ఫ్యాన్స్ కోసం పంచుకున్నారు. ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న పూజా త్వరలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

ఇటీవలే మహేష్ తన ఫారిన్ వెకేషన్ పూర్తి చేసుకొని వచ్చారు. నవంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో SSMB 28 షూట్ తిరిగి ప్రారంభం అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. వరుస పరాజయాలతో డీలా పడ్డ పూజాకు ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి. మహేష్ మూవీ సూపర్ హిట్ అయితే ఆమెకు తెలుగులో మరలా ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు. పూజా హెగ్డే నటించిన గత మూడు చిత్రాలు రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
పూజకు లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ మరో బంపర్ ఆఫర్ ఆమెకు మహేష్ మూవీ రూపంలో ఇచ్చారు. మహేష్ తో పూజాకు ఇది రెండవ చిత్రం. వీరి కాంబినేషన్ లో విడుదలైన మహర్షి మంచి విజయం సాధించింది. అయితే పూజా పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కోల్పోయారు. దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ప్రకటించిన భవదీయుడు భగత్ సింగ్ దాదాపు రద్దయినట్లే అంటున్నారు. ఆ మూవీ హీరోయిన్ గా పూజాను అనుకున్నారు. డిలే అవుతూ వస్తున్న ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవు.

పూజా హెగ్డే చేతి నుండి చేజారిన మరో భారీ ఆఫర్ జనగణమన. లైగర్ మూవీ వైఫల్యం జనగణమనకు చరమగీతం పాడింది. దర్శకుడు పూరి జగన్నాధ్ అదృష్టం బాగుండి ఏమాత్రం లైగర్ ఆడినా జనగణమన పూర్తి చేసేందుకు నిర్మాతలు ఒప్పుకునేవారు. డిజాస్టర్ కావడంతో నిర్మాతలు పూరిని నమ్మి అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు వెనకాడారు. ఆ సినిమా హీరోయిన్ గా ఎంపికైన పూజా దాదాపు రూ. 4 కోట్లు రెమ్యూనరేషన్ ఒప్పందం చేసుకున్నారన్న టాక్ వినిపించింది. జనగణమన మూవీ ఆగినా సల్మాన్, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పూజా జత కడుతున్నారు.