Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఓ జంట ప్రవర్తన కొంచెం జుగుప్సాకరంగా మారింది. ముద్దులు, హగ్గులు దాటి, రాత్రి ఒకే బెడ్ పై పడుకునే వరకు వెళ్ళింది. ఎఫెక్షన్, కనెక్షన్ తో గేమ్ పై కూడా ఫోకస్ తగ్గిందని, హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చినా, వీరిద్దరూ మారలేదు. వాళ్లెవరో కాదు, షణ్ముఖ్,సిరి. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. పేరుకేమో బెస్ట్ ఫ్రెండ్స్, ప్రవర్తన మాత్రం డీప్ లవర్స్ ని తలపిస్తుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఇద్దరి మధ్య గొడవలు, అలకలు, గిల్లి కజ్జాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తరచుగా షణ్ముఖ్ సిరిపై కోప్పడతాడు.. దూరంగా వెళ్ళిపో అంటూ విసుక్కుంటాడు. దానికి సిరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాసేపటి తర్వాత నాదే తప్పు అంటూ.. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఇక హగ్గులు, ముద్దులు షురూ.. అవుతాయి. షణ్ముఖ్ దూరం పెట్టాడని బాత్ రూమ్ కి వెళ్లి సిరి, తనని తాను భాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బయట మాకు లవర్స్ ఉన్నారని చెప్పుకునే షణ్ముఖ్, సిరి… సదరు లవర్స్ ఫీల్ అవుతారేమో అని కొంచెం కూడా ఆలోచించరు. లవర్స్ కిమ్ మించిన బాండింగ్.. కనెక్షన్ మైంటైన్ చేస్తున్నారు.
#BiggBossTelugu5 🤮🤮🤮 #siri ki siggu ledu .. #shannu ki budi ledu 😂 that’s it https://t.co/1wHqUTlCox
— FactsBabu (@BabuFacts) November 23, 2021
ఇక నిన్న ఎపిసోడ్ లో వీళ్ళ వ్యవహారం మరింత శృతి మించింది. ఇద్దరూ ఒకే బెడ్ పై హగ్ చేసుకొని పడుకున్నారు. హౌస్ లో సంగతులు గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ మధ్య ఉన్నది స్నేహమే అనుకుందాం.. అయితే ఒకే బెడ్ పై హగ్ చేసుకొని పడుకోవడం ప్రేక్షకులకు వల్గర్ గా తోచింది. దీనితో సోషల్ మీడియాలో హాట్ హాట్ కామెంట్స్ పేలుతున్నాయి. పబ్లిక్ గా ఇలా తెగించారేంట్రా బాబు.. అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. గత వీకెండ్ లో నాగార్జున ఇద్దరినీ పిలిచి, రిలేషన్ తగ్గించి గేమ్ పై ఫోకస్ పెట్టాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా వారిలో మార్పులేదు.
Rey @StarMaa ee midnight masala entra maku 😳#biggbosstelugu5 #biggboss5telugu #shannu #siri pic.twitter.com/nP1m6U5dJD
— APPADAM = BOOTHU (@sritarak4) November 23, 2021
ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మానస్ కెప్టెన్ కాగా ఎలిమినేషన్ నుండి మినహాయింపు పొందాడు. సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ ని వీడనున్నారు. లేటెస్ట్ గా అనీ మాస్టర్, ఎలిమినేటైన విషయం తెలిసిందే.
Also Read: Rajamouli: టైం రా బాబు… రాజమౌళిని ఎగతాళి చేస్తున్న పవన్ ఫ్యాన్స్!