AP government: ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్ ల తిరుగుబాటు

AP government: ఆకులు నాకేటోడికి మూతులు నాకేవాడు తోడని చెబుతారు. అసలే డబ్బులు లేక ఇబ్ందులు పడుతున్న సర్పంచులకు ప్రభుత్వం పదిహేడో ఆర్థిక సంఘం నిధులు ఖాతాల్లో వేసినా తరువాత లాగేసుకుంది. దీంతో సర్పంచుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక సంస్థల బలోపేతానికి పాటుపడతామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో సర్పంచులు డైలమాలో పడిపోతున్నారు. ఈ ఏడాదికి రావాల్సిన నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో పడగా వాటిని వివిధ అవసరాలకు వినియోగించుకోవాలని భావించారు. […]

Written By: Neelambaram, Updated On : November 24, 2021 2:40 pm
Follow us on

AP government: ఆకులు నాకేటోడికి మూతులు నాకేవాడు తోడని చెబుతారు. అసలే డబ్బులు లేక ఇబ్ందులు పడుతున్న సర్పంచులకు ప్రభుత్వం పదిహేడో ఆర్థిక సంఘం నిధులు ఖాతాల్లో వేసినా తరువాత లాగేసుకుంది. దీంతో సర్పంచుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక సంస్థల బలోపేతానికి పాటుపడతామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో సర్పంచులు డైలమాలో పడిపోతున్నారు.

ఈ ఏడాదికి రావాల్సిన నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో పడగా వాటిని వివిధ అవసరాలకు వినియోగించుకోవాలని భావించారు. సర్పంచులు ఈ డబ్బులతో స్థానిక అవసరాలు తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ ఖాతాలో పడిన నిధులు హఠాత్తుగా మాయమయ్యాయి. ఏం జరిగిందని సర్పంచులు ప్రశ్నిస్తే డబ్బులు తీసుకున్నామని అధికారులు చెప్పారు. కానీ మళ్లీ డబ్బులు ఇస్తారో లేదో కూడా తేల్చలేదు.

దీంతో సర్పంచుల్లో ఆందోళన పెరుగుతోంది. సర్పంచ్ గా గెలిచినా లాభం లేదని వాపోతున్నారు. రూ. లక్షలు పెట్టి గెలిచినా సంబరం లేదని నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. డబ్బులు లేక దగా పడుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. పేరుకుపోయిన బిల్లులతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అయినా వైసీపీ సర్పంచులే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని సందిగ్దంలో పడిపోతున్నారు.

Also Read: MLC Elections: స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఏక‌ప‌క్ష‌మే..

ఇప్పటికే కొందరు సర్పంచులు తమకు పదవి అక్కర్లేదని రాజీనామాలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్వాకంతోనే ప్రజాప్రతినిధుల్లో భయం పట్టుకుంది. చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. రావాల్సిన నిధులు మాత్రం రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తాము ఎందుకు గెలిచామో అన్న సందేహంలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Also Read: BJP: భాగ్యనగరంలో మరింత బలపడేందుకు బీజేపీ నజర్

Tags