Sai Dharam Tej: గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు అభిమానులతో టచ్ లో ఉండాలి. అందుకే తరచుగా ఆన్లైన్లో చాట్ చేస్తారు. అభిమానులతో పాటు నెటిజెన్స్ తమ ప్రశ్నలు, సందేహాలు సంధిస్తూ ఉంటారు. విసిగించే డౌట్లు, వింత విన్నపాలు కూడా ఈ క్రమంలో ఎదురవుతాయి. హీరో సాయి ధరమ్ కి అలాంటిదే ఓ షాకింగ్ రిక్వెస్ట్ వచ్చింది. ఓ నెటిజెన్ సాయి ధరమ్ తేజ్ ని అప్పు అడిగాడు. అది కూడా లక్షల్లో. సదరు అభిమాని కామెంట్ కి సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో స్పందించాడు.
సాయి ధరమ్ తేజ్ ని అభిమాని రూ. 10 లక్షలు కావాలి. కొంచెం ఇవ్వగలరు అంటూ కామెంట్ పెట్టాడు. వెంటనే రియాక్ట్ అయిన సాయి ధరమ్ తేజ్ బ్రహ్మానందం నవ్వుతున్న జిప్ పోస్ట్ చేశాడు. మరొక నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడని అడిగాడు. నీ పెళ్లి అయ్యాక నా పెళ్లి అని సాయి ధరమ్ సెటైర్ వేశాడు. సాయి ధరమ్ తేజ్ ఆన్లైన్ చాట్ వైరల్ అయ్యింది. కాగా సాయి ధరమ్ కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
ఇటీవల కజిన్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఇటలీ దేశంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో సాయి ధరమ్ తేజ్ మీద కూడా ఒత్తిడి పెరిగిందట. సాయి ధరమ్ తేజ్ కి సంబంధాలు వెతుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై స్పష్టమైన సమాచారం లేదు. గత ఏడాది బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
సాయి ధరమ్ కమ్ బ్యాక్ మూవీ విరూపాక్ష భారీ విజయం సాధించింది. సస్పెన్సు హారర్ జోనర్లో తెరకెక్కిన విరూపాక్ష మంచి లాభాలు పంచింది. ఇక మామయ్య పవన్ కళ్యాణ్ తో చేసిన మల్టీస్టారర్ బ్రో ఓ మోస్తరు విజయం అందుకుంది. దర్శకుడు సముద్ర ఖని వినోదయ సితం రీమేక్ గా బ్రో తెరకెక్కింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే మూవీ చేస్తున్నారు.