https://oktelugu.com/

నెటిజన్ ప్రశ్న: ఆ కోరిక తీర్చవా సాయిధరమ్ తేజ్?

మెగా స్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్స్ తక్కువైనా సినిమాలు మాత్రం ఆపడం లేదు. ‘రేయ్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ హీరో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు కలవరపెట్టాయి. చిత్రలహరి మూవీతో మరోసారి హిట్ ట్రాక్ అందుకున్న సాయిధరమ్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో తీసిన ‘ప్రతిరోజు పండుగే’ మూవీతో రెండో హిట్ ను తన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2021 / 04:50 PM IST
    Follow us on

    మెగా స్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. హిట్స్ తక్కువైనా సినిమాలు మాత్రం ఆపడం లేదు. ‘రేయ్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ హీరో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు కలవరపెట్టాయి.

    చిత్రలహరి మూవీతో మరోసారి హిట్ ట్రాక్ అందుకున్న సాయిధరమ్. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో తీసిన ‘ప్రతిరోజు పండుగే’ మూవీతో రెండో హిట్ ను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇది అతడి కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది.

    ఇక గత ఏడాది ‘సోలో బ్రతుకే సో బెటర్’తో హ్యాట్రిక్ అందుకున్నాడు. తాజాగా సీరియస్ దర్శకుడు దేవకట్టాతో కలిసి ‘రిపబ్లిక్’ అనే సినిమాను తీస్తున్నాడు. పొలిటికల్ సెటైర్ గా రాబోతున్న ఈ సినిమాలో రమ్యక్రిష్ణ సీఎంగా చేస్తోంది.

    వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్ కు సంబంధించిన విషయాలు, ఫ్యాన్స్ తో పంచుకుంటున్నాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాయిధరమ్ తేజ్ ను తాజాగా ఓ నెటిజన్ వింత కోరిక కోరింది. ‘మీ ఫోన్ నంబర్ ఇవ్వండని’ సాయిధరమ్ ను ఓ అభిమాని అడిగాడు. దీనికి సాయిధరమ్ ఓ ఊహించని ఫొటోతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ‘శివమణి’ సినిమాలో ఫోన్ నంబర్ ఇవ్వగానే అందరూ కలిసి ఎమ్మెస్ నారాయణను కాల్స్ చేసి ఇబ్బంది పెడుతారు. ఇప్పుడదే సీన్ కు సంబంధించిన పిక్ ను పెట్టిన సాయిధరమ్ తేజ్.. ‘నెంబర్ ఇస్తే నా పొజిషన్ ఇంతే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడిది వైరల్ గా మారుతోంది.