శ్రీలంక రెండో వికెట్ చేజార్చుకుంది. కుల్ దీప్ యాదవ్ చాన్నాళ్ల తర్వాత వికెట్ పడగొట్టాడు. 16.1వ బంతికి దూకుడుగా ఆడుతున్న రాజపక్స (22) ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడబోయిన రాజపక్స ధావన్ చేతికి చిక్కాడు. అలాగే 16.4 బంతికి మినోద్ భనుక (27) ను ఔట్ చేశాడు. పృథ్వీ షా క్యాచ్ అందుకున్నాడు.