Republic Movie: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ దేవాకట్టా తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హెరోయిన్ గా నటించింది. ఇక జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. రాజకీయ వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగంలోని అవినీతిని పరిష్కరించే ఐఏఎస్ అధికారి పాత్రలో తేజ్ అదరగొట్టాడు అని చెప్పాలి.
అయితే ఈ సినిమాను చూసిన ఓ ప్రేక్షకుడు మూవీపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. కాగా ఆ పోస్ట్ కి స్పందించి దర్శకుడు దేవాకట్టా ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో రిపబ్లిక్ చిత్రంలో “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను, కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్, ఎందుకో గానీ ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే ఎత్తేసేవాళ్ళం” అంటూ సదరు నెటిజన్ డైరెక్ట్ గా దేవాకట్టాను ట్యాగ్ చేశాడు. అందుకు గాను దేవకట్టా స్పందిస్తూ “ఇది మూడు రోజుల్లో మింగి ఊసే మిఠాయి కాదు, వేప రసం లాంటి నిజం కాబట్టి మెల మెల్లాగా లోతుగా దిగుతూ ఉంది, దిగుతూనే ఉంటుంది. ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు ధన్యుడ్ని! థాంక్యూ!” అంటూ రిప్లై ఇచ్చాడు.
https://twitter.com/devakatta/status/1466621618646441986?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1466621618646441986%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fdirector-deva-katta-reply-to-netizen%2F