Neninthe' Re-Release Collection
Neninthe’ Re-Release Collection : కొన్ని సినిమాలు కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కాలం గడిచే కొద్దీ సోషల్ మీడియా, టీవీల ప్రభావం కారణంగా కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకుంటాయి. అప్పటి ఆడియన్స్ కి ఆ చిత్రాలు పెద్దగా నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పటి ఆడియన్స్ కి మాత్రం ఆ సినిమాలు తెగ నచ్చేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో మాస్ మహారాజ రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘నేనింతే’ చిత్రం కూడా ఉంటుంది. సినీ ఇండస్ట్రీ లో ఉండే కష్టాలను, ఒక సినిమా తీసి, అది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దాకా, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎన్ని కష్టాలను, అనుమానాలను ఎదురుకుంటారో పూరి జగన్నాథ్ చాలా చక్కగా, అద్భుతంగా ఈ చిత్రం లో చూపించాడు. రవితేజ ఈ సినిమాలో నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. అందుకే ఆయనకు ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ‘ఉత్తమ నటుడిగా’ నంది అవార్డు కూడా దక్కింది.
ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఎదో ఒక సమయంలో మనం బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాము. అలాంటి సినిమాని రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 26వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. కొన్ని సెంటర్స్ లో అయితే రీసెంట్ గా విడుదలైన రవితేజ కొత్త సినిమాలు కూడా అంత వసూళ్లను రాబట్టలేదు. ఆ రేంజ్ లో ఈ చిత్రం ఇరగకుమ్మేసింది. విడుదలై మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘విక్రమార్కుడు’ ,’వెంకీ’ వంటి విజయవంతమైన రీ రిలీజ్ చిత్రాల తర్వాత ఈ సినిమాకి కూడా అలాంటి రెస్పాన్స్ రావడం గమనార్హం. ఒకప్పుడు ఫ్లాప్ అయినప్పటికీ, ఇప్పుడు మంచి రెస్పాన్స్ ని దక్కించుకోవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో రవితేజ అభిమానులు చేసిన సంబరాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలు చూస్తే అభిమానులకు రవితేజ అంటే ఎంత అభిమానమో చూసే ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. రవితేజ వింటేజ్ సినిమాలు వేరే లెవెల్ లో ఉంటాయని, అలాంటి హీరోకి సరైన బ్లాక్ బస్టర్స్ పడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని, కానీ రవితేజ టాలెంట్ ని దర్శక నిర్మాతలు ఈమధ్య కాలంలో సరిగా ఉపయోగించుకోవడం లేదని అభిమానులు బాధపడుతున్నారు. ఆయన గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఈ టీజర్.