Prabhas: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, దాంతో సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ లో కూడా అదనపు హంగులు కోరుకోవడం.. ఇలా ఏ రకంగా చూసుకున్నా, ‘రాధేశ్యామ్’ టీం అంచనాలను అందుకోలేకపోతుంది. దాంతో టీమ్ పై అన్ని రకాలుగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అన్నిటికీ మించి ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ అనేది ఒక ప్రహసనంగా మారింది. ఏ పోస్టర్ వదిలినా, ఏ సాంగ్ వదిలినా ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. దానికి తోడు యువీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ విషయంలో మొదటి నుంచి అన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ వస్తోంది. అసలు ఈ సంస్థ పై ప్రభాస్ ఫ్యాన్స్ పగ పెంచుకునే వరకు వెళ్ళింది అంటేనే.. అర్థం చేసుకోవచ్చు.
యువీ ఎంతలా పొరపాట్లు చేసిందో. ఇప్పటికే యువీకి వ్యతిరేకంగా ప్రభాస్ ఫ్యాన్స్ అనేకసార్లు నెగిటివ్ ట్రెండింగ్ చేయడానికి తెగ ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యారు. అయినా యువీ అధినేతలు మాత్రం మారట్లేదు. సినిమా నుంచి ఫలానా టైంకు అప్ డేట్ వస్తోంది అని నాలుగు రోజులు ముందు నుంచే అనవసర పబ్లిసిటీలు చేస్తారు.
మొన్న వచ్చిన మొదటి పాట విడుదల విషయంలోనూ 5 గంటలకు పాట వస్తోంది అంటూ రెండు రోజులు సోషల్ మీడియాలో క్యాంపెన్ కూడా రన్ చేశారు కానీ చివరకు ఎప్పటిలాగే 5 గంటలకు పాట రాలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. ‘రాధేశ్యామ్’ టీం కనీస ప్లాన్ లేకుండా పాన్ ఇండియా సినిమా ఎలా చేస్తోంది ? ఇలా పిచ్చి పిచ్చిగా బెహేవ్ చేస్తూ.. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకుంటే.. సినిమాను బ్యాన్ చేస్తారు.
Also Read: Comedy Stars Promo: పెళ్ళైన మరుసటి రోజుకే జంప్ అయిన కమెడియన్ భార్య
ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు ఈ సినిమాను పూర్తిగా బ్యాన్ చేశారు. ఎలాగూ ప్రభాస్ నుంచి మరో మూడు సినిమాలు వస్తున్నాయి. కాబట్టి, ఈ సినిమా పోయినా పోయేది ఏమి లేదు. అందుకే, తమను బాధ పెట్టిన యువీ వాళ్ళను కూడా బాధ పెట్టాలని ఫ్యాన్స్ బాగా ఫిక్స్ అయ్యారు. అందుకే, ప్రభాస్ ఫ్యాన్సే.. ప్రభాస్ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu Promo: నేను ఒంటరి వాడనంటూ షన్ను కంటతడి, బాత్రూం లో ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన సిరి