https://oktelugu.com/

Sreemukhi: ఈ షోలో అవి ఉంటాయి నీ భార్యకు ఓకేనా… ఆ సీరియల్ హీరోని నేరుగా అడిగేసిన శ్రీముఖి!

ఇక తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన బుల్లితెర సెలెబ్రెటీలు జోడీలుగా మారారు. మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 22, 2024 / 04:46 PM IST

    Neethone-Dance-2.0

    Follow us on

    Sreemukhi: స్టార్ మా ఛానల్ లో గతంలో ప్రసారమైన నీతోనే డాన్స్ సీజన్ 1 సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు సీజన్ 2 లాంచ్ చేయబోతున్నారు. గత ఆదివారం సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. దీంతో ఆ ప్లేస్ లో నీతోనే డాన్స్ సీజన్ 2 ని ప్రారంభించనున్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుంది. హీరోయిన్ రాధ, సదా, తరుణ్ మాస్టర్ జడ్జిలుగా సీజన్ 2 కి కూడా కంటిన్యూ అవుతున్నారు.

    ఇక తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన బుల్లితెర సెలెబ్రెటీలు జోడీలుగా మారారు. మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నారు. మధ్య మధ్యలో యాంకర్ శ్రీముఖి పంచులు వేస్తూ రచ్చ రేపుతోంది. ఈ క్రమంలో బ్రహ్మముడి ఫేమ్ మానస్ ని ఓ ఆట ఆడుకుంది. కాగా మానస్ – శుభశ్రీ జోడిగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మానస్ కి రీసెంట్ గా పెళ్ళైన సంగతి తెలిసిందే.

    దీంతో శ్రీముఖి .. మానస్ మరి డాన్స్ షో అంటే రొమాన్సులు ఉంటాయి. మన వైఫ్ కి ఓకేనా అని, అడిగింది. దీంతో మానస్ షాక్ అవుతాడు. మన వైఫ్ ఏంటి అని అంటాడు. కొత్తగా పెళ్లయింది కదా. నీ భార్య వేరే అమ్మాయిలతో రొమాన్స్ చేస్తే ఒప్పుకుంటుందా? అనే అర్థంలో శ్రీముఖి అడిగింది. శ్రీముఖి పంచ్ కి అంతా నవ్వుతారు. ఈసారి మొత్తం పది జోడీలు షో లో సందడి చేయనున్నాయి. నయని పావని – ప్రిన్స్ యావర్, మానస్ – శుభశ్రీ, విశ్వ – నేహా, బాల ఆదిత్య – పూజ మూర్తి, నాగపంచమి ఫేమ్ దర్శన గౌడ – పృద్వి శెట్టి, విష్ణు – వరలక్ష్మి, ఏక్ నాధ్ – హారిక వంటి జంటలు పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నారు.

    ఇక సీజన్ 1 విషయానికి వస్తే సందీప్ మాస్టర్ – జ్యోతి రాజ్ జోడి విన్నర్ గా నిలిచింది. అంజలి – పవన్ ల జంట రన్నర్ అప్ అయ్యారు. దీంతో సీజన్ 2 విన్నర్ ఎవరు అవుతారనే ఆసక్తి నెలకొంది. కాగా ఈ ప్రోమో కి బాగా రెస్పాన్స్ వస్తుంది. నీతోనే డాన్స్ రియాలిటీ షోని ఆదివారం గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ షో కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.