Tamil Nadu : తమిళనాట మూడు కూటముల పొత్తులు ఓ కొలిక్కి

తమిళనాట మూడు కూటముల పొత్తులు ఓ కొలిక్కివచ్చింది. ఏ పార్టీలో ఏవి ఉన్నాయి? వాటి రాజకీయం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : March 22, 2024 5:51 pm

Tamil Nadu : తమిళనాట పొత్తుల అంశం ఓ కొలిక్కి వచ్చేసింది. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు మూడు వేర్వేరుగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఇందులో డీఎంకే కూటమి అందరికన్నా ముందుగా ప్రకటన చేసింది.

డీఎంకే కూటమిలో పోయిన సారి పార్టీలకే ఈసారి కూడా సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పెద్ద డిమాండ్ పెట్టినా డీఎంకే తగ్గలేదు. వీసీకే నాన్ రీజర్వ్ సీటు కావాలని డిమాండ్ చేసినా ఇవ్వలేదు..పోయిన సారి ఎన్ని సీట్లు ఇచ్చారో అన్నే సీట్లు ఇచ్చారు. పెద్దగా మార్పు రాలేదు.

-కోయంబత్తూరులో సీపీఎం ఎంపీ గెలవగా.. దిండిగల్ లో పోటీ చేస్తోంది. కోయంబత్తూరును డీఎంకేనే తీసుకొని పోటీ చేస్తోంది.

-డీఎంకే వ్యతిరేక కూటమి అన్నాడీఎంకే నేతృత్వంలో ఉండేది. ఇప్పుడు అది రెండుగా చీలింది. బీజేపీ నుంచి విడిపోయి అన్నాడీఎంకే సపరేట్ గా పోటీచేస్తోంది. డీఎండీకే (విజయకాంత్) కు 5 సీట్లు కేటాయించింది. ఎస్.డీపీఐకి 1 సీటు, పీటీ పార్టీకి 1 సీటు కేటాయించింది.ఈ కూటమి పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది.

ఇక మూడోది బీజేపీ కూటమి చూస్తే.. ముఖ్యమైన కూటమిగా మారింది. దీని గురించి మాట్లాడుకోవాలి. బీజేపీకి 20 సీట్లు, పీఎంకేకు 10 సీట్లు కేటాయించారు. ఓ పన్నీర్ సెల్వం లోక్ సభకు పోటీ చేయకుండా బీజేపీ కి మద్దతు ప్రకటించబోతున్నారు. సామాజిక కూటమిగా.. చిన్న పార్టీలన్నీ కలిసి బీజేపీకి మద్దతు పలికాయి..

తమిళనాట మూడు కూటముల పొత్తులు ఓ కొలిక్కివచ్చింది. ఏ పార్టీలో ఏవి ఉన్నాయి? వాటి రాజకీయం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Tags