https://oktelugu.com/

Acharya Movie: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఆచార్య టీమ్… నవంబర్ 5న “నీలాంబరి” సాంగ్

Acharya Movie: కొరటాల శివ, మెగస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో  మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 2, 2021 / 11:57 AM IST
    Follow us on

    Acharya Movie: కొరటాల శివ, మెగస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పైగా ఇందులో  మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వీళ్లకు జంటగా కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‏టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

    ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. “నీలాంబరి” అనే సాంగ్ ను నవంబర్‌ 5 వ తేదీన ఉదయం 11.05 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఇక ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది. వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

    https://twitter.com/KonidelaPro/status/1455409064083484673?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1455409064083484673%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Facharya-second-single-neelambari-release-date-is-here.html

    ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే  మలయాళం మూవీ ” లూసిఫర్ ” రీమేక్ గా తెరకెక్కుతున్న ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటు మెహర్‌ రమేశ్ డైరెక్షన్ లో ” భోళా శంకర్ ” కి ఒకే చెప్పగా… బాబీతో చేయబోయే సినిమాకి ” వాల్తేరు వాసు ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.